అద్భుత ఛాయాచిత్రకారుడు


Wed,August 7, 2019 12:52 AM

ఫొటోగ్రాఫర్ అనగానే మనకు ఠక్కున వెలిగేది ఫొటోలు తీస్తాడని. కానీ ఆ ఫొటోల్లో జీవితాల్ని చూపించగలగడమే అతడిలోని ప్రత్యేక ైస్టెల్. అతనే కరీంనగర్‌కు చెందిన వారాల అన్వేష్. అందిరిలా ఫొటోలు తీస్తే మజా ఏముంటుందనుకున్న ఆ యువకుడు ప్రపంచాన్ని భిన్నంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటీవలె జాతీయ ఫిలిం ఇనిస్టిట్యూట్ పరీక్షల్లో ప్రతిభచాటి శభాష్ అనిపించుకున్నాడు.
Photographer
కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, సినీ విమర్శకుడు వారాల ఆనంద్ కుమారుడే 24 ఏండ్ల వారాల అన్వేష్. ఫొటోగ్రఫీపై మక్కువ ఉన్న అన్వేష్ ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ల పనితనాన్ని నిశితంగా పరిశీలించేవాడు. వాటిలో వేర్వేరు శైలిలను గమనించాడు. నీడలు, ప్రతిబింభాలను తన కెమెరాలో బంధించి పోటోగ్రఫికి కొత్తదనాన్ని తీసుకువచ్చాడు. తన కంటికి కనపడిన ప్రతిదాన్ని కూడా తన కెమెరాలో బంధించడం మాత్రమే కాక, ఆయన తీసిన ప్రతి ఫొటోలోనూ జీవితాలు ప్రతిబింభించేలా తీయడం అన్వేష్ ప్రత్యేకత.

సినిమాటోగ్రఫీ, ఫొటోగ్రఫీ పట్ల తనకున్న మక్కువతో ఇస్రోలో చేస్తున్న తన ఉద్యోగాన్ని కూడా వదిలేశాడు. ఇటీవలి వరకు స్వంతంగా ఛాయాచిత్రాలు తీసే కంపెనీని నిర్వహించాడు. ఇప్పటికే ఆయన పలు వెడ్డింగ్ వీడియోగ్రఫితో పాటు జి.వి.కె, టి. సుబ్బిరామిరెడ్డి, రామోజీరావు సంస్థలతోనూ పనిచేస్తున్నాడు. అయితే గతంలో ఫొటో కెమేరా కంటికి మాత్రమే చిక్కే అందమైన చిత్రాలను అన్వేష్ మొబైల్ కెమేరాతో చిత్రీకరించి తన ప్రతిభను చాటుకున్నాడు.

Photographer2
ఇదిలా ఉండగా జాతీయ ఫిలిం ఇనిస్టిట్యూట్, ప్రవేశపరీక్షల్లోనూ సత్తాచాటాడు. పుణె, కోల్‌కతాలోని ఫిలిం అండ్ టీవీ ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో వేర్వేరుగా ర్యాంకులు సాధించాడు. సత్యజిత్‌రే ఇన్‌స్టిట్యూట్‌లో ఐదు సీట్లు ఉండగా, ఇంటర్వ్యూ, ఓరియెంటేషన్‌లలో జాతీయ స్థాయిలో టాపర్‌గా నిలిచాడు. పుణె ఇనిస్టిట్యూట్‌లో అదే కోర్సుకు పది సీట్లుండగా ఓబీసీ కోటాలో మొదటిర్యాంక్ సాధించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫైన్‌ఆర్ట్స్ డీగ్రీ చేసిన అన్వేష్ భవిష్యత్‌లో కళాత్మక సినిమాలు తీయడానికి సినిమాటోగ్రఫీ కోర్సు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.

451
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles