80 వేల మంది గుండెల్లో..


Wed,August 7, 2019 12:48 AM

ఆమె జీవితకాలం మొత్తం ఎదుటివారికోసం తాపత్రయపడింది. వారికోసం ఎన్నో సంస్థలు ప్రారంభించి అవార్డులు అందుకుంది. 80 వేల మంది మహిళలకు జీవితాన్నిచ్చింది. అందుకేనేమో ఇప్పుడామె లేకపోయినా పేరుమాత్రం అందరి గుండెల్లో నిలిచిపోయింది.
aunaben
గుజరాత్‌కు చెందిన అరుణాబెన్ శంకర్‌ప్రసాద్ దేశాయ్ 1946లో వికాస్ విద్యాలయాన్ని స్థాపించింది. పిల్లల కోసం ప్రాథమిక పాఠశాల, రెండు ఉన్నత పాఠశాలలు , పాలిటెక్నిక్, హస్తకళా కళాశాలలను స్థాపించింది. కొన్ని గ్రామాలకు టైలరింగ్, ఎంబ్రాయిడరీ పనులతో ఉపాధి కల్పించింది. పేద ప్రజలకు ఆశ్రయం, ఆరోగ్య సంరక్షణ, విద్య అందించడానికి ఒక వ్యవస్థాపక గృహాన్ని ప్రారంభించింది. కాస్మోపాలిటన్ హాస్టల్‌తో 800 మందికి పైగా బాలికలకు సహాయపడింది. అందుకుగాను అరుణాబెన్‌కు 2005లో జమ్నాలాల్ బజాజ్ అవార్డు ప్రదానం చేశారు. దీంతో పాటు 1981లో శిశు సంక్షేమ రంగానికి అవార్డు, 1989లో మహిళా సురక్ష అవార్డు, 2002లో శ్రీ రాజీవ్ గాంధీ మానవ సేవల పురస్కారాలు అందుకుంది. 83 ఏండ్ల వయసులో 2007 ఫిబ్రవరి 18న అరుణాబెన్ మరణించింది. ఈ వికాస్ విద్యాలయాన్ని గుజరాత్ ప్రభుత్వం సౌరాష్ట్ర పిల్లల చట్టం కింద పిల్లల సంక్షేమానికి ఫిట్ పర్సన్ ఇనిస్టిట్యూట్‌గా పరిగణిస్తున్నది. ఆమె స్థాపించిన సంస్థలు వందలాది మందికి సహాయపడుతున్నాయి. భారతదేశంలోని ప్రముఖ సామాజిక కార్యకర్తలలో ఒకరిగా ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోయింది.

428
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles