కిడ్నీ ఇవ్వాలంటే ఒకే బ్లడ్‌గ్రూప్ ఉండాలా?


Wed,August 7, 2019 12:46 AM

మా వారి వయసు 30 ఏండ్లు. కొంతకాలంగా అతనికి కాళ్లలో వాపు, బీపీ, వాంతులు వస్తుండడంతో డాక్టర్‌ను సంప్రదించాం. అన్ని రకాల పరీక్షలు చేసి క్రానిక్ కిడ్నీ సమస్య ఉన్నట్లు నిర్ధారించారు. డయాలసిస్ ప్రారంభించారు. వారానికి మూడుసార్లు చేస్తున్నారు. అయితే కిడ్నీ మార్పిడియే ఉత్తమం అని డాక్టర్ సలహా ఇచ్చారు. నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. మా ఆయనది బీ పాజిటివ్. మా వారికి నా కిడ్నీ ఇద్దాం అనుకుంటున్నా. అయితే బ్లడ్ గ్రూపులు కలువకపోతే కిడ్నీ ఇవ్వడానికి అవకాశం లేదా? దయచేసి తెలుపగలరు.
- గీత, సీతాఫల్‌మండి

Counselling
బ్లడ్‌గ్రూప్‌లు కలువకపోయినా కిడ్నీ మార్పిడి వీలవుతుంది. ఆ అనుమానాలే వద్దు. మీరు కచ్చితంగా కిడ్నీ ఇవ్వాలి అనుకుంటే మీ వారికి నిస్సందేహంగా ఇవ్వొచ్చు. ఏబీఓఇన్ కంపటబుల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనే ఆధునిక వైద్య ప్రక్రియలో భాగంగా ఇలా ఇవ్వవచ్చు. వారానికి మూడుసార్లు డయాలసిస్ అంటున్నారు కాబట్టి సమస్య తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కిడ్నీ మార్పిడీయే పరిష్కారం. ఏబీఓఇన్ పద్ధతి ద్వారా ప్రత్యేకమైన ప్లాస్మా ఫెరాసిస్ ప్రక్రియ ద్వారా వేర్వేరు బ్లడ్‌గ్రూపుల్లోని యాంటీజెన్‌ను కలిసేలా చేస్తారు. ఇదొక వరం లాంటిది. మీ వారికి మీరు కిడ్నీ దానం చేసి కొత్త జీవితాన్ని పొందవచ్చు. ఆల్ ది బెస్ట్.

డాక్టర్ శశికిరణ్
కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్
యశోద హాస్పిటల్స్ ,మలక్‌పేట్

612
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles