సవాళ్లతో ప్రయాణం ఆమె జీవితం


Mon,August 5, 2019 01:10 AM

ఆడపిల్లలకు ఉన్నత చదువులైనా, ఉన్నత ఆలోచనలైనా, నిర్ణయాలైనా అన్నీ ఒక్కోసారి సమాజంలో వ్యతిరేకతను కలిగి ఉంటాయి. కుటుంబంలో పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. అట్లాంటి కుటుంబానికీ, సమాజానికి సవాళ్లు విసిరి తనేంటో నిరూపించుకుంది గీత.
geetha
ముంబైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది గీత. ఆరేండ్ల వరకూ ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. ఆ తర్వాత ఆమె పోలియోకు గురైంది. కాళ్లు కోల్పోయి క్రచెస్‌కు పరిమితం అయింది. పాఠశాలకు వెళ్లాలన్నా, పనులు చేసుకోవాలన్నా ఎన్నో సమస్యలు ఎదుర్కొనేది. కొన్ని పాఠశాలలు ఆమెకు అడ్మిషన్‌ను కూడా ఇవ్వలేదు. అయినా ప్రభుత్వ పాఠశాలలో చేరి పదో తరగతి చదివింది. ఇంటర్ చదవుతానంటే తండ్రి తీవ్రంగా వ్యతిరేకించాడు. తండ్రిని ఎదిరించి పార్ట్‌టైం జాబ్‌లో చేరింది. ఎంకామ్ వరకూ తన సొంత డబ్బుతో చదువుకోగలిగింది. జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తే 28 కంపెనీలు ఆమె పరిస్థితిని చూసి రిజెక్ట్ చేశాయి. చివరికి ఓ మార్కెటింగ్ కంపెనీలో ఉద్యోగం సాధించింది. కొన్నిరోజులకే అక్కడ బ్రాంచ్ మేనేజర్‌గా ప్రమోషన్ పొందింది. ఈ క్రమంలోనే కొలీగ్ సుజిత్‌ను ప్రేమ పెండ్లి చేసుకుంది. కానీ కొద్ది రోజులకే సుజిత్ ఓ ప్రమాదంలో మృతి చెందాడు. ఇది ఆమె జీవితంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయినా కుంగిపోలేదు. మానసిక ధైర్యం కోసం కొత్త దారులు వెతుక్కుంది. అప్పుడు మహారాష్ట్ర వీల్‌చైర్ బాస్కెట్‌బాల్‌లో చేరి ఉత్సాహంగా ఆటను నేర్చుకుంది. ఇప్పటివరకు ఐదు జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించింది. అంతర్జాతీయ పోటీలకు హాజరవుతున్నది. ఇప్పటివరకూ నేను చాలాచోట్ల రిజెక్ట్ అవుతూ వచ్చాను. కారణం నేను ఒక మహిళను అనే. కానీ నేను బాధపడలేదు. అవన్నీ నన్ను ఆపవు. నేను ఎప్పటికైనా నన్ను నేను, నా ప్రయత్నాన్ని నమ్మకుంటాను అని ధైర్యంగా చెబుతున్నది గీత.
gettha1

557
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles