ప్రియమైన తండ్రులారా వినండి..


Sun,August 4, 2019 12:42 AM

samira-reddy
రెండోసారి తల్లి అయిన బాలీవుడ్ నటి సమీరారెడ్డి తల్లిపాల వారోత్సవాల్ని జరుపుకుంటున్నది. ప్రెగ్నెన్సీ సమయంలో ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నది. ప్రత్యేక ఫొటోషూట్ కూడా చేసింది. బిడ్డ పుట్టాక ఆ శుభవార్తను ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఫొటోలు పెట్టింది. అవన్నీ వైరల్ కాగా.. తాజాగా ఆమె ఓ వీడియో పెట్టి దాంతోపాటూ ఓ స్ట్రాంగ్ మెసేజ్ కూడా పంపింది. ఆ వీడియోకి ప్రస్తుతం మంచి కామెంట్స్ వస్తున్నాయి. చాలామంది ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా వీడియో పెట్టిన సమీరా అందుకు సంబంధించి తన అభిప్రాయాన్ని ఫ్యాన్స్‌తో మెసేజ్ రూపంలో చెప్పింది. ప్రపంచ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ సందర్భంగా తన కూతురి ఫొటోను కూడా షేర్ చేసింది సమీరా రెడ్డి. ఈ సందర్భంగా తల్లులతోపాటూ తండ్రులకూ ముఖ్యమైన మెసేజ్‌లను పోస్ట్ చేసింది. కొత్త తండ్రులు, పిల్లల్ని ప్రేమించేవాళ్లంతా వినండి. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా మీ పిల్లల తల్లికి మీరు ఎక్కువ సపోర్ట్ ఇవ్వాలి అని కోరింది సమీరా. సమీరాతోపాటూ నేహా ధూపియా కూడా ప్రపంచ తల్లి పాల వారోత్సవాల క్యాంపెయిన్ నిర్వహిస్తున్నది. సమీరారెడ్డి పెట్టిన ఫొటో, వీడియోను మెచ్చుకుంటూ నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

1039
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles