ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌ తయారీ


Sun,August 4, 2019 12:31 AM

నేడు స్నేహితుల దినోత్సవం. ప్రతిఒక్కరి జీవితంలో మర్చిపోలేని స్నేహితులుంటారు. కొంతమంది దగ్గరగా ఉంటారు. మరికొంతమంది దూరంగా ఉండడంతో పలుకరించడం కూడా కష్టమవుతుంది. అలాంటివారిని దగ్గర చేసేందుకే ఈ ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌. మరి దీని తయారీ ఎలానో తెలుసుకోండి.
bracelite
-ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్‌కు కావాల్సిన రంగురంగుల ఊలు దారాలు, కత్తెర, టేపు తీసుకోవాలి.
-ఎవరికైతే కట్టాలనుకుంటున్నారో టేపు ద్వారా వారి చేతి మణికట్టు కొలతలు తీసుకోవాలి. ఆ కొలతలకు తగినట్లుగా, ముడి వేసేందుకు సరిపడా అదనంగా ఊలు దారాన్ని కత్తిరించుకోవాలి.
-ఏ డిజైన్‌ అయితే ఎంపిక చేసుకుంటారో దానికి కావాల్సిన దారాలను సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఒక రంగు దారం తర్వాత మరొక రంగు దారం వచ్చేలా చూసుకోవాలి. లేదంటే ఆకర్షణీయంగా ఉండదు.
-ముందుగా దారం విడిపోకుండా ఉండేందుకు ముడి వేసుకోవాలి. ఆ తర్వాత మూడు దారాలతో జడని అల్లినట్లు అల్లాలి. అలా మూడు అంగుళాల వరకు అల్లి మరొక ముడి వేసి వేరే డిజైన్‌ వచ్చేలా అల్లాలి.
-మధ్యలో వేరే డిజైన్‌ వచ్చి రెండు చివర్ల ఒకే అల్లిక ఉండి చివర్లో ముడి వేయాలి. అప్పుడే బ్యాండ్‌ చూడడానికి అందంగానూ, కలర్‌ఫుల్‌గానూ ఉంటుంది.
-ఫొటోలో చూపిన విధంగా రంగుల దారాలని ఎంచుకోవచ్చు. మీ చేతులతో తయారు చేసిన బ్యాండ్‌ ఫ్రెండ్‌కు కడితే వారి ఆనందమే వేరు.

216
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles