తిరుగులేని స్టార్!


Sun,July 28, 2019 12:46 AM

పెద్ద కళ్లు, అందమైన ముఖంతో అందరినీ ఆకట్టుకున్నది. మలయాళం డైలాగులు చెబుతూ అందరినీ మంత్రముగ్ధుల్ని చేసిన తొమ్మిదేండ్ల ఆరుని కురుప్. కొన్ని రోజుల నుంచి ప్రేక్షకులకు దూరంగా ఉంది. దానికి కారణం ఓ విషాదం.
aruni
సోషల్ మీడియా ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుంది. దీంతో కొందరు స్టార్ పేరు సంపాదించుకుంటున్నారు. ఈ కోవకు చెందిందే టిక్‌టాక్ స్టార్ ఆరుని కురుప్. ఆమె అందమైన అమ్మాయే కాదు మంచి మాటకారి కూడా. మాటలు చెబుతుంటే అక్కడి నుంచి కదలాలనిపించదు. అందుకే కాబోలు టిక్‌టాక్‌లో 14 వూల యంది ఫాలోవర్లను సంపాదించుకున్నది. ఇంత చిన్న వయసులోనే స్టార్‌గా మారిన ఆరుని చావుని కూడా పెద్దదానిలా స్వీకరించింది. రోజూ తన వీడియోలతో అభిమానులను అలరిస్తున్న ఆరుని కొన్నిరోజులుగా టిక్‌టాక్‌కు దూరంగా ఉన్నది. దీనికి కారణం ఆరునికి బ్రైన్ సమస్య అని తెలిసింది. ట్రివేండ్రమ్‌లోని ఎస్.ఐ.టి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మరణించిందంటూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాలుగో తరగతిలోనే స్టార్‌డమ్‌గా పేరు తెచ్చుకున్న ఆమె అభిమానులు వార్తను జీర్ణించుకోలేకపోయారు. నన్ను ప్రోత్సహించిన నా అభిమానులకు కృతజ్ఞతలు అని పోస్ట్ చేసి అందరినీ కంటనీరు పెట్టించింది ఆరుని.

396
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles