చొరవ చూపి... చేరదీసి..!


Mon,July 22, 2019 12:41 AM

మహారాష్ట్రలోని జలగావ్ పట్టణంలో సమతా నగర్ ఓ స్లమ్ ఏరియా. అక్కడ కొంతమంది చెత్త ఏరుతూ జీవనం గడుపుతుంటారు. ఆరేండ్ల పిల్లల నుంచి 70 ఏండ్ల వ్యక్తుల వరకూ ఇదే పని. అద్వైత్, ప్రణాలి దంపతుల రాకతో వారి జీవన విధానంలో మార్పులొచ్చాయి.
Adwait-and-Pranali
అద్వైత్, ప్రణాలి ఇద్దరూ వేర్వేరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు. ముంబై నగరంలో కార్పొరేట్ ఉద్యోగాలు చేశారు. అద్వైత్ చదువుకుంటున్న సమయంలోనే ప్రణాలి పరిచయమైంది. పెండ్లి కూడా చేసుకున్నారు. ఇద్దరూ ప్రాజెక్ట్ పనిలో భాగంగా రూరల్ ఏరియాల్లో తిరుగాల్సి వచ్చేది. ఈ క్రమంలోనే సమతానగర్ స్లమ్ ఏరియా పరిస్థితులు వీళ్లను కలిచి వేశాయి. మురుగు నీరు, వ్యాధులు, చదువుకు దూరమైన పిల్లలు, పౌష్టికాహార లోపం, గుట్కా, తంబాకుకు అలవాటైన పిల్లల పరిస్థితి అంతా వీళ్లను బాధించింది. 2013లో అద్వైత్ ఉద్యోగాన్ని వదిలేసి ఇక్కడే స్థిరపడి వీళ్లలో మార్పులు తేవాలని ఆశించారు. వర్ధిష్ణు అనే నాన్‌ప్రాఫిట్ ఆర్గనైజేషన్ స్థాపించారు. మొదట చెత్త ఏరుకొనే వారితో మాట్లాడి, వారి పిల్లలను స్థానిక పాఠశాలలకు పంపేందుకు కృషి చేశారు. సుదీర్ఘకాలం తర్వాత వంద మంది పిల్లలను పాఠశాలల్లో చేర్పించారు. తర్వాత వారికి ఆశ్రయం కల్పించడానికి కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేసి బొమ్మలు, పుస్తకాలు అందుబాటులో ఉంచారు. టీచర్లతో కలిసి ప్రచారం చేశారు. విపరీతంగా గుట్కాలు, తంబాకులకు బానిసలైన పిల్లలకు, చెత్త ఏరుకుంటున్న యువకులకు ఉపాధి కల్పించడానికి కృషి చేశారు. ఇలా స్థానికుల్లో అవగాహన కల్పిస్తూ, వలంటరీలుగా చేర్పించుకొని మురికి వాడల అభివృద్దికి, చెత్త ఏరుకొనే వారికి ఉపాధి కల్పించడంలో ఈ దంపతులు సక్సెస్ అవుతున్నారు.
Adwait-and-Pranali2

924
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles