ఈగల్ని, దోమల్ని తరిమేయండిలా.


Mon,July 22, 2019 12:33 AM

masquito
-వర్షాకాలంలో దోమలు, ఈగల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటిని ఇంటి నుంచి తరిమి కొట్టేందుకు చిన్న రిబ్బన్‌కు లావెండర్ నూనెను పూస్తే.. అవి పారిపోతాయి.
-మాంస పదార్థాలపై రోజ్‌మేరీ చల్లితే ఫలితం ఉంటుంది. ఆహారం రుచి కూడా పెరుగుతుంది. ఈగలు వాలవు.
-వేప నూనె వాసనకు దోమలు పరారవుతాయి. ఈ నూనె ఒంటికి రాసుకుంటే దోమలు దగ్గరికి కూడా రావు.
-వాటర్ స్టోరేజీ ఉన్న స్థలాల్లో కాఫీ పొడి చల్లితే దోమలు వెళ్లిపోతాయి.
-నిమ్మగడ్డి నుంచి తీసిన రసంతో తయారు చేసిన కొవ్వొత్తులను ఇంట్లో ఉంచుకుంటే మంచిది. ఆ వాసనకు ఈగలు, దోమలు పారిపోతాయి.

2052
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles