బరువు తగ్గండిలా!


Sun,July 21, 2019 01:04 AM

అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా? జిమ్‌కి సమయాన్ని కేటాయించలేకపోతున్నారా? ఇంటిపనులతోనే సమస్యకు చెక్ పెట్టండి.
cleanig
ఫ్లోర్ శుభ్రత : నేలను శుభ్రం చేయడానికి మ్యాపింగ్ స్టిక్ వాడుతుంటారు. దీనికి బదులుగా గుడ్డతో ఫ్లోర్‌ను శుభ్రపరిస్తే శరీరానికి వర్కవుట్‌గా పనిచేస్తుంది. దీంతో బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది.
పాత్రల శుభ్రత : ఈ కాలంలో పాత్రలు శుభ్రపరిచేందుకు పనివారి సహాయం తీసుకుంటున్నారు. వర్కవుట్ కోసం ఈ యాక్టివిటీ చేస్తే ఆరోగ్యంగా ఉంటారు. దీంతో భుజాలకు తగిన కదలికలు జరుగుతాయి. శరీరంలో అదనపు కేలరీలు కరుగుతాయి.
లాండ్రీ : బట్టలు ఉతకడం, వాటిని మడతపెట్టడం ఆ తర్వాత ఐరన్ చేయడం వంటి పనులు శరీరంలోని అదనపు కేలరీలను కరిగించేందుకు ఉపయోగపడుతాయి. బట్లలు ఉతకడం వల్ల పొట్టవద్ద కొవ్వు తగ్గుతుంది. వాటిని ఆరేయడం వల్ల చేతులకు తగిన వ్యాయాయం అందుతుంది. ఐరన్‌తో శరీర ఆకృతి మారుతుంది.
సీలింగ్ ఫ్యాన్ శుభ్రత : వారానికో సారి ఇంట్లో గోడలపై పేరుకుపోయిన బూజును దులపడం వల్ల శరీరం ఆరోగ్యకరమైన అలసటకు గురవుతుంది. దీంతో అదనపు కేలరీలు కరుగుతాయి.
కారు శుభ్రత : కారును శుభ్రపరుచడం వల్ల కూడా కేలరీలు కరుగుతాయి. బరువును నియంత్రించుకోవచ్చు. రోజూ కడుగడం వీలు కాకుంటే రోజు మార్చి రోజు లేదా వారానికి రెండుసార్లు ఈ వర్కవుట్ చేయడం వల్ల బరువు తగ్గొచ్చు.

1495
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles