రగ్బీలో సరికొత్త రికార్డు


Sun,July 21, 2019 01:03 AM

క్రికెట్ వరల్డ్ కప్ హోరులో పడి మనల్ని ఈ వార్త చేరలేదు. కానీ భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని సంచలనాన్ని మహిళా క్రీడాకారులు సృష్టించారు. మహిళల రగ్బీ క్రీడలో అంతర్జాతీయ టోర్నీలో విజయం సాధించి కొత్త అధ్యయానికి నాంది పలికారు.
rugbe
తొలిసారి ఓ అంతర్జాతీయ రగ్బీ-15 మ్యాచ్‌లో ఈ జట్టు విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆసియా మహిళల చాంపియన్ షిప్ టోర్నీలో భారత మహిళల టీమ్ తనదైన ప్రతిభను కనబరిచింది. కిందటి నెల ఫిలిప్పీన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సింగపూర్‌పై గెలిచి ఈ ఘనతను సాధించారు. ఆసియా రగ్బీ మహిళల చాంపియన్ షిప్ డివిజన్-1లో భాగంగా ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తలపడ్డ భారత జట్టులోని మహిళలు అందరి నేపథ్యాలు వేర్వేరు. డాక్టర్, టీచర్, హోమ్ మేకర్ ఇలా భిన్న నేపథ్యాల నుంచి వచ్చినవారే. దాదాపు గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి ఈ రగ్బీలో తలపడ్డారు. మహారాష్ట్రకు చెందిన వాహ్బిజ్ భరూచా కెప్టెన్‌గా, రాష్ర్టానికి చెందిన నేహా పరదేశీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించారు. మొత్తం 26 మంది క్రీడాకారిణులున్న జట్టులో 10 మంది ఢిల్లీకి చెందినవారున్నారు. ఒడిశాకు చెందినవారు ఏడుగురు, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారు నలుగురు, బిహార్‌కు చెందినవారు ఇద్దరు ఉన్నారు. 34 యేండ్ల వయస్సున్న సంగీత బీర అందరికన్నా ఎక్కువ వయస్సున్న క్రీడాకారిణి. నాలుగేండ్ల కిందట బాబుకు జన్మనిచ్చింది. మూడు నెలల్లోనే మైదానంలోకి అడుగుపెట్టింది. ప్రియా బైసా రగ్బీలోకి ప్రవేశించకపోతే పాఠశాల వయస్సులోనే ఆమె పెండ్లి చేసేవారు. 2009 తర్వాత రగ్బీ గవర్నింగ్ బాడీ జాతీయ టోర్నమెంట్‌లను నిర్వహించింది. కొన్నేండ్ల తర్వాత మహిళల నుంచి కూడా దీనికి స్పందన రావడంతో రగ్బీ ఆటలో మహిళలను ప్రోత్సహించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో రగ్బీపై ఆసక్తి ఉన్న మహిళలు ముందుకు వచ్చారు. చాలామంది మహిళలు ట్రైబల్ ఏరియా నుంచి రావడం విశేషం. వీరందరూ వివిధ టోర్నీల్లో పాల్గొని వీరిలోంచి 26 మంది మహిళలు అంతర్జాతీయ పోటీలకు వెళ్లనున్నారు.

397
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles