విజయంతో సమాధానం చెప్పండి!


Sun,July 21, 2019 01:01 AM

యూట్యూబ్ స్టార్, రచయిత, యాక్టర్, లేట్‌నైట్ షో హాస్ట్.. లిల్లీసింగ్. ఈమె ఏం చేసినా సంచలనమే. యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఈమెకు యువత నుంచి మంచి ఫాలోయింగ్ ఉన్నది. ఇటీవల ఆమె చేసిన సందేశాత్మక ట్వీట్ వైరల్‌గా మారింది.
Lilli-singh
లిల్లీసింగ్ ఇటీవల సరదాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతున్నది. కొందరికి సందేశాత్మకంగా కూడా మారింది. ఇంతకీ ఆమె ట్విట్టర్‌లో ఏమన్నారంటే.. రెండు నెలలుగా కష్టపడి పనిచేయడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకుంటున్నా. నేను చేసే ఏ పనిని కష్టంగా భావించట్లేదు. ఇష్టంగానే భావిస్తూ ముందుకెళ్తున్నా. పది నిమిషాలు సమయం దొరికినా కొత్తగా ఏదైనా పని చేయడానికే కేటాయిస్తున్నా. ఒక పని పూర్తి చేశాను అనే ఆలోచన నాకెంతో ప్రశాంతతనిస్తుంది. వారం రోజులు పని చేసి ఒక్క రోజు ఆనందంగా, సరదాగా గడిపితే పని ఒత్తిడిని జయించవచ్చు. ఈవిషయం తెలియక చాలామంది పని ఒత్తిడిలో నలిగిపోతుంటారు. కేటాయించిన సమయంలోనే నా పని ముగిస్తాను. ఆ తర్వాత సమయంలో మనసుకు ఆహ్లాదం కలిగే వ్యాపకాన్ని చేస్తుంటాను. నన్ను ఎగతాళి చేసిన వారికి నేను విజయం ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నా. మిమ్మల్ని మీరు విజేతగా నిలబెట్టుకునేందుకు కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవడం ఒక్కటే మార్గం అంటూ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. వీకెండ్స్‌లో తన పెంపుడు కుక్కతోపాటు నీటి మధ్యలో విశ్రాంతి పొందుతున్న ఫొటోను లిల్లీసింగ్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ను ఎంతోమంది షేర్ చేస్తున్నారు.

481
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles