ఊహలే కథలుగా!


Sun,July 21, 2019 12:39 AM

నిద్రిస్తున్నప్పుడు వచ్చే కలల్లో కొందరు విహరిస్తుంటే మరికొందరు భయంతో వణుకుతుంటారు. ఎప్పుడు ఎలాంటి కలలు వస్తాయో, అవి ఎంతవరకు గుర్తుంటాయో చెప్పలేరు. ఇలా వచ్చిన కలల్ని ఊహించుకొని పుస్తకంగా రూపొందించిన ఈ బాల రచయిత ఎవరో తెలుసా?
Na-Harith
హర్యానాలోని యమునానగర్‌కు చెంది న ఆరిత్‌ గుప్తాకు పద్నాలుగేండ్లు. ‘సంత్‌ నిశ్చల్‌ సింగ్‌ పబ్లిక్‌ స్కూల్‌'లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఇతనికి ఊహాగమనం ఎక్కువ. చదువుతో పాటు ‘ది ఫ్లేమ్స్‌ ఆఫ్‌ బిగినింగ్‌' అనే పుస్తకం రాశాడు. దీనికి 10 కల్పిత నేర కథలను ఎంచుకున్నాడు. జరగని విషయాలు జరిగినట్టుగా ఊహించుకొని కథలు రాయడంలో దిట్ట. గుప్తాను దేవుడిచ్చిన గొప్ప వరంలా స్కూల్‌ టీచర్లంతా భావిస్తారు. 2018లో ‘ది ఫ్లేమ్స్‌ ఆఫ్‌ బిగినింగ్‌' పుస్తకం రాయడం మొదలుపెట్టాడు. 8 నెలల గడువులో పుస్తకం రాసి ఉపాధ్యాయులను ఆశ్చర్యపరిచాడు. ఈ పుస్తకాన్ని అమేజాన్‌ బెస్ట్‌సెల్లర్స్‌లో అమ్మకానికి పెట్టాడు.
flames
గుప్తా స్కూల్లో ఎంత బిజీగా ఉన్నా ఊహకు వచ్చిన అంశాన్ని కాగితంలో రాసుకుంటూ ఉంటాడు. రాత్రి 10 నుంచి 12 గంటల వరకు సమయాన్ని పుస్తకం రాయడానికి కేటాయిస్తున్నాడు గుప్తా. చేతన్‌ భగత్‌, రస్కిన్‌ బాండ్‌, బ్రిటిష్‌ రచయిత రోల్డ్‌ డాల్‌ పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటాడు. అందులో నచ్చిన అంశాలను నోట్‌ చేసుకుంటాడు. చాలా నవలలను సినిమాలుగా రూపొందిస్తారు. వాటిని చూసినప్పుడు గుప్తాలో ఏదో తెలియని సంతోషం. ఆ సినిమాలు చూసినప్పుడల్లా చాలా సలహాలు వస్తాయంటున్నాడు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సహకరిస్తే ‘బుక్‌ క్లబ్‌' పెట్టాలనుకుంటున్నాడు. దీంతో చదువుకోలేని వారు ఈ క్లబ్‌కు వచ్చి చదువుకునే వీలు కల్పిస్తూ క్రియేటివ్‌ అంశాలతో యువతకు ఆదర్శంగా నిలబడాలనుకుంటున్నాడు. చండీఘడ్‌లోని ‘ది గ్రేట్‌ ఇండియన్‌ బుక్‌ ఫెయిర్‌'లో ప్రసంగించడానికి గుప్తాని ఆహ్వానించారు. రాజ్‌ రెండవ నవలను రాస్తున్నాడు. దాన్ని ప్రచురించే పనిలో ఉన్నాడు. పుస్తకానికి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు.

221
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles