ఒంటరి ప్రయాణమా?


Fri,July 19, 2019 12:39 AM

JURNY
ఒంటరిగా ప్రయాణించడం ఇప్పుడు ఒక సరదా. అది అన్ని వేళలా ఒకేలా ఉండకపోవచ్చు. అయితే తప్పకుండా జర్నీ చేయాల్సి వస్తే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.


ప్రయాణాల్లో ముఖ్యమైంది డబ్బు. అవసరమున్న మేరకే డబ్బులు జేబులో లేదా పర్సులో ఉంచుకోవాలి. మిగిలినవి డెబిట్, క్రెడిట్ కార్డు రూపంలో ఉంచుకోవడం అవసరం. మనం బస చేయాల్సిన హోటల్ విషయంలో తగి న జాగ్రత్తలు తీసుకోవాలి. డబ్బులకోసం చిన్నచిన్న హోటల్‌లో కాకుండా గుర్తింపు పొందిన హోటల్ లోనే బస చేయడం ఎంతో సేఫ్. దగ్గరివారి నంబర్లు మొబైల్‌లో ఉన్నాయని ఊర్కోకుండా సన్నిహితుల, కుటుంబ సభ్యుల మొబైల్ నంబర్లు డైరీలో కూడా రాసుకోవడం బెటర్. అలా చేస్తే ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా బయటపడే అవకాశం ఉంటుంది.జర్నీలో భాగంగా క్యాబ్ మాట్లాడుకోవాల్సి వస్తే, ఆ వాహన వివరాలు అన్నీ దగ్గరి బంధువులకో, తల్లిదండ్రులకో చెప్పండి. అలా చెప్పినప్పుడు క్యాబ్ విషయంలో తలెత్తే సమస్యలనుండి బయటపడవచ్చు.

786
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles