అందమైన నది


Fri,July 19, 2019 12:37 AM

RAINBO
దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఉన్న ఈ నది పేరు రెయిన్‌బో . ప్రపంచంలోనే ఇంత అందమైన నది మరోటి ఉండదేమో అన్నంత అందంగా ఈ నది ఉంటుంది. ఈ నదిని చూడడానికి రెండు కళ్లు చాలావన్నంతంగా ఇంద్రధనుస్సు రంగులు ఈ నది సొంతం.


ఈ నది ఇంత అందంగా ఉండడానికి కారణం తన ఒడిలో నింపుకున్న రంగులే. దీన్ని ఖనిజాల గని అని అంటారు. ఈ నది రంగును చూసి పర్యాటకులంతా మంత్రముగ్ధులు అవుతుంటారు. ఈ ప్రాంతంలో మకరేనియా క్లేవిగెరా అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయి. వాటి వల్లే ఈ నది రంగు అలా ఉంటుందని స్థానిక టూరిస్టు గైడ్ వాల్తర్ రామోస్ అంటున్నారు. వివిధ రంగుల్లో కనువిందు చేస్తున్న ఈ నదిని కనో క్రిస్టాలీస్, రెయిన్ బో రివర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి లక్షల ఏళ్ల చరిత్ర ఉందట. దీన్ని షీల్ ఆఫ్ గయానాగా కూడా అభివర్ణిస్తారు. ఈ నది రంగు గురించి అనేక వాదనలు ఉన్నాయి. రాళ్లల్లో ఖనిజాలు ఉండటంతో నదికి ఈ రంగు వచ్చిందని కొందరు అంటారు. ఖనిజాలతోపాటు రాళ్లు ఎక్కువగా ఉండటం వల్ల... ఇక్కడ మొక్కలు ఎక్కువ ఎత్తు పెరగలేవని చెబుతారు. ఈ మొక్కలు ఏడాదికి ఒక సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయి. భూమిలోని ఖనిజాలకు అనుగుణంగా ఇక్కడి పూల రంగు ఉంటుంది. అమెజాన్ అడవి, ఆండియన్ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం ఇక్కడ కలిశాయి. నీటి మొక్కలు పెరిగే ఈ ప్రాంతంలో వేరువేరు జోన్లు ఉన్నాయి. ఈ నది వల్ల ఈ ప్రాంతానికి మంచి పేరు వచ్చింది. ఒకప్పుడు దీన్ని ప్రమాదకరమైన ప్రాంతంగా భావించేవారు. కానీ, పర్యాటకంగా అభివృద్ధి చెందే కొద్దీ ఆ అభిప్రాయం పోతున్నది. పర్యాటకానికి అనువుగా మారడంతో ప్రతిరోజు పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను చూసి అందరూ ముగ్ధులవుతున్నారు.

409
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles