లగ్జరీ ఫ్రూట్‌!


Thu,July 18, 2019 01:01 AM

సీజన్‌లో కొన్ని పండ్లకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఆ సమయంలో మామూలు రోజుల కంటే రెండు మూడు రెట్లు అధిక ధరకు అమ్ముతుంటారు. కానీ ఓ దేశంలో కిలో ద్రాక్ష ధర ఏకంగా లక్ష దాటింది. ఎందుకంత రేటు?
japan-grapes
జపాన్‌లో ‘రుబీ రోమన్‌ గ్రేప్స్‌'గా పిలిచే ఈ ద్రాక్ష పండ్లను చాలా అరుదుగా పండిస్తారు. వీటికి ప్రతి ఏటా గిరాకీ పెరుగుతూ వస్తున్నది. జపాన్‌లోని ఇషికావా దీవిలో వీటిని పరిమితంగా పండిస్తారు. పంట కోతకు వచ్చాక మొదటి విక్రయంలో ఒక ద్రాక్ష గుత్తిని వేలం వేస్తారు నిర్వాహకులు. ఒక్కో ద్రాక్ష గుత్తిని కొనుగోలు చేయడానికి వందల మంది పోటీపడుతుంటారు. ఇటీవల జరిగిన వేలంలో కిలో ద్రాక్ష 11వేల డాలర్లు (భారత కరెన్సీలో రూ.7.5 లక్షలు) వెచ్చించి కొనుగోలు చేశారు. ఆ గుత్తిని ఎవరు సొంతం చేసుకున్నారన్న విషయాన్ని మాత్రం నిర్వాహకులు గోప్యంగా ఉంచారు. 11 ఏండ్ల నుంచి నిర్వహిస్తున్న ఈ వేలంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి అధిక ధర పలికింది. ధరకు తగ్గట్టే ఈ ద్రాక్ష పండ్లు చాలా రుచిగా ఉంటాయట. సాధారణ రోజుల్లో కూడా రోమన్‌ గ్రేప్స్‌ గుత్తి ధర రూ.31,537 వరకు ఉంటుంది. కొన్ని హోటళ్లలో ధనికులకు ప్రత్యేకంగా అందిస్తారు. సంపన్నులు మాత్రమే వీటిని కొనుగోలు చేస్తారు. కాబట్టి దీన్ని ‘లగ్జరీ ఫ్రూట్‌' అని కూడా పిలుస్తారు.

496
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles