ఎంతైనా సరే.. పంపేద్దాం!


Wed,July 17, 2019 01:27 AM

File-Sharing
మెయిల్‌లో ఫైల్ పంపాలంటే 25 ఎంబీలకు మించి కుదరదు. అంతకన్నా పెద్దగా ఉంటే గూగుల్ డ్రైవ్‌లోకి వెళ్తుంది. అప్‌లోడ్ అవడానికి కూడా టైం పడుతుంది. ఇవే ఇలా ఉంటే మరి అంతకంటే ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్‌ను ఎలా పంపాలి? అందుకోసం కొన్ని ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.. అవేంటంటే..

ఎక్కువ జీబీలు ఉన్న ఫైల్స్‌ను పంపాలంటే ఒకప్పుడు సిడీలు, డీవీడీలు, పెన్‌డ్రైవ్‌లే గుర్తుకువచ్చేవి. వాటిలోకి రైడ్ చేసుకొని ఫైల్స్‌ను పంపేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది ! ఆ ట్రెండ్‌కు తగ్గట్టే ఫైల్స్ ట్రాన్స్‌ఫరింగ్‌లో కూడా మార్పులొచ్చాయి. సైజ్‌తో సంబంధం లేకుండా ఎంత పెద్ద ఫైల్స్‌ను అయినా ఆన్‌లైన్ ద్వారా పంపేయొచ్చు. సాధారణంగా మనం జీ మెయిల్‌ను వాడినట్టుగానే వీటి ద్వారా ఎంత పెద్దఫైల్స్‌ను అయినా పంపొచ్చు.
File-Sharing1

We Transfer

లిమిట్ : 2జీబీ
తక్కువ పరిమితులతో ఉన్న చక్కటి వేదిక. దీని ద్వారా 2 జీబీ లోపు ఉన్న ఫైల్స్‌ను ఒకేసారి అటాచ్ చేయొచ్చు. అంతకన్నా ఎక్కువ ఉంటే పంపలేం. అవతలి వారి ఈమెయిల్ అడ్రస్, మన ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయడమే మన పని. ఎదుటివారు ఈమెయిల్ లింక్ నుంచి మనం పంపిన ఫైల్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దీన్ని వాడడానికి అకౌంట్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇందులో We Transfer Plus సర్వీస్ కూడా ఉంది. దీనికి డబ్బులు చెల్లిస్తే అదనపు ఫీచర్లు ఉంటాయి. 20 జీబీ వరకూ ఫైల్ అటాచింగ్, 100 జీబీల వరకూ డేటా స్టోరేజీ, పాస్‌వర్డ్ ప్రొటెక్షన్, షెడ్యుల్ ట్రాన్స్‌ఫర్ వాటిలో ఆ ఫీచర్లు.
www.We Transfer .com
File-Sharing2

MailBigFile

లిమిట్ : 2జీబీ
మెయిల్ బిగ్‌ఫైల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లే కొద్ది మనోహరమైన ఇంటర్‌ఫేస్‌తో యూజర్‌ను లోనికి తీసుకెళ్తుంది. దీని ద్వారా 2జీబీ డేటాను ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. కానీ 5 ఫైల్స్‌ను మాత్రమే అటాచ్ చేయడానికి వీలుంది. కావాలంటే ఫైల్స్ అన్నింటినీ కంప్రెస్ చేసి అటాచ్ చేసుకోవచ్చు. దీంట్లో మరో మూడు రకాల సర్వీస్‌లున్నాయి. ప్రో, బిజినెస్, బిజినెస్ లైట్ సర్వీలు అవి
www.MailBigFile.com
File-Sharing3

Filemail

లిమిట్ : 30 జీబీ
దీని ద్వారా ఒకేసారి 30జీబీల డేటాను షేర్ చేయొచ్చు. మనం పంపిన ఫైల్స్‌ను కచ్చితమైన టైం లిమిట్‌లో అవతలి వారు డౌన్‌లోడ్ చేసుకొనే వీలుంది. ఉదాహరణకు.. వారం, పది రోజుల్లోపు మాత్రమే డౌన్‌లోడ్ అవకాశం ఇవ్వొచ్చు. మనం సెట్ చేసిన టైం లిమిట్ దాటితే అవతలి వారికి ఫైల్స్ డౌన్‌లోడ్ కావు. మనం ఎవరికీ ఏమేం ఫైల్స్ పంపామో డౌన్‌లోడ్ పేజీ ఆప్షన్‌లో చెక్ చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రో వెర్షన్‌లో అదనపు ఫీచర్లు ఉంటాయి. మెయిల్‌ను ట్రాక్ చేయడం, వారు దాన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారా? ఎన్ని సార్లు చేసుకున్నారు అనే విషయాలను చూడొచ్చు. పంపుతున్న ఫైల్స్‌కు పాస్‌వర్డ్, ఏ సమయంలో పంపాలో షెడ్యూల్ కూడా సెట్ చేయొచ్చు.
www.Filemail.com
File-Sharing4

Send this File

లిమిట్ : ఏమీ లేదు
డేటాను షేర్ చేయడానికి ప్రైవేట్ అండ్ సెక్యూర్డ్ వెబ్‌సైట్ ఇది. దీంట్లో ఫైల్ పంపడానికి సైజ్‌లో ఎలాంటి పరిమితులు లేవు. ఎంత పెద్ద ఫైల్‌ను అయినా సింగిల్ క్లిక్‌లో పంపొచ్చు. ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్షన్ దీని ప్రత్యేకత. కాబట్టి డేటాకు ఎలాంటి ముప్పు ఉండదన్నమాట. ఈ వెబ్‌సైట్ సర్వీస్‌ను వాడుకోవాలంటే ఇందులో అకౌంట్ రిజిస్టర్ చేయాల్సిందే. అది ఉచితమే. ప్రో వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
www.SendthisFile.com
File-Sharing5

MediaFire

లిమిట్ : 10 జీబీ
ఇదో క్లౌడ్ సర్వీస్. ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫ్లాట్ ఫామ్ కాదు. కానీ దీని నుంచి కూడా ఫైల్స్‌ను షేర్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవాలంటే ఖాతా తప్పనిసరి. అది ఉచితమే. ఖాతా తెరవగానే ఉచితంగా 10జీబీ ఫైల్ స్టోరేజీ పొందొచ్చు. దీంట్లోకి అప్‌లోడ్ చేసిన ఫైల్స్‌ను సెలక్ట్ చేసి ఇతరులకు పంపవచ్చు. షేర్ ఆప్షన్‌ను క్లిక్ చేస్తే ఒక లింక్ వస్తుంది. దాన్ని అవతలి వారికి షేర్ చేయడం ద్వారా కేవలం ఆ ఫైల్స్‌ను మాత్రమే వారు డౌన్‌లోడ్ చేసుకోవడానికి వీలుంటుంది. డబ్బులు చెల్లిస్తే మరో 50 జీబీ స్పేస్‌ను కూడా పొందవచ్చు.
www.MediaFire.com
File-Sharing6

e-mail Drives

ఈమెయిల్ ద్వారా<.B>
పెద్ద ఫైళ్లను పంపడానికి పాపులర్ ఈమెయిల్ సర్వీసులు క్లౌడ్ స్టోరేజ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. ఉదాహరణకు జీమెయిల్ వాడుతున్న వారికి గూగుల్ డ్రైవ్ అదనంగా 15 జీబీ స్టోరేజ్‌ను ఇస్తుంది. ఈ డ్రైవ్‌లోకి మనం ఫైల్స్‌ను అప్‌లోడ్ చేశాక వాటిని ఇతరులకు షేర్ చేయవచ్చు. ప్రెజెంటేషన్స్, డాక్యుమెంట్స్, ఇతర ఫైళ్లను ఒకేసారి అప్‌లోడ్ చేయడానికి 50 ఎంబీల పరిమితి ఉంటుంది. అలాగే మైక్రోసాఫ్ట్ ఈమెయిల్ వినియోగదారులు కూడా వన్‌డ్రైలో 15 జీబీ స్పేస్‌ను ఉపయోగించుకోవచ్చు. దీని సహాయంతో అవుట్‌లుక్, హాట్‌మెయిల్ అకౌంట్‌లో నుంచి లార్జ్ ఫైల్స్ పంపుకోవచ్చు. ఇందులో ఒక ఫైల్ అప్‌లోడ్‌కు 10 జీబీ లిమిట్ ఉంటుంది. ఏ ఫైల్‌ను షేర్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపై రైట్ క్లిక్ చేస్తే షేర్ ఏ వన్‌డ్రైవ్ లింక్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ లింక్‌ను నేరుగా ఈ మెయిల్‌లో పేస్ట్ చేసుకోవచ్చు. యాహూ సైతం డ్రాఫ్‌బాక్స్ ఉంది. ఈ మూడు పాపులర్ మెయిల్స్‌లోనే 150ఎంబీ ఫైల్స్‌ను త్వరగా పంపుకోవచ్చు.

- వినో..

1514
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles