గూగుల్ మ్యాప్స్‌లో డైనింగ్


Wed,July 17, 2019 12:59 AM

google-maps
గూగుల్ వినియోగదారుల కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా మ్యాప్స్‌లో మూడు డైనింగ్ ఫీచర్లను జోడించింది.

నగరాల్లోని మంచి హోటళ్లలో భోజనం చేయాలంటే ఇక గూగుల్ మ్యాప్స్‌లో వెతికితే సరిపోతుంది. 11 నగరాల్లోని హోటళ్లలో భోజన వివరాలు తెలుసుకునేందుకు ఆఫర్ ఫీచర్‌ను గూగుల్ మ్యాప్స్‌లో జోడించింది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె నగరాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈజీడైనర్ సంస్థతో కలిసి ఆఫర్ ఫీచర్‌ను గూగుల్ అందిస్తున్నది. 4 వేలకు పైగా రెస్టారెంట్లలో ఆఫర్స్ తెలుసుకోవచ్చు.ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌లో ఆఫర్స్ షార్ట్‌కట్‌ను క్లిక్ చేస్తే వివరాలన్నీ కనిపిస్తాయి. యూజర్స్ అభిరుచులకు అనుగుణంగా ఎక్స్‌ప్లోర్ ట్యాబ్‌ను తీర్చిదిద్దింది. బంకులు, ఏటీఎంల వంటి ఏడు విభాగాల షార్ట్‌కట్లూ ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్ యూ ట్యాబ్ ద్వారా కొత్త రెస్టారెంట్లు, వార్తల్లో ఉన్న ప్రదేశాలు, యూజర్లు నోటిఫికేషన్ పొందవచ్చు.

547
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles