పాత దుకాణాలన్నీ కొత్తగా!


Wed,July 17, 2019 12:33 AM

మొట్టమొదటి బుక్‌బైండింగ్ షాపు పుణేలో మొదలైంది. ఆ తర్వాతే ఎన్నో దుకాణాలొచ్చాయి. ఇలాంటి షాపు ప్రత్యేకత ఈ తరానికి తెలియక కొత్త దుకాణాల వైపు అడుగులేస్తున్నారు. అందుకే వారిని ఆకర్షించేలా రంగులద్దుతున్నారు ఈ అమ్మాయిలు.
anushka
ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిలు.. అలెఫియా, అనుష్క. పుణేలోని పేపర్ షాప్ యజమాని రవివార్ పేత్ కూతురు అలెఫియా. వీరి దుకాణం మూడు తరాల నుంచి నడుస్తున్నది. దీనికి చాలామంచి పేరుంది. ఆ తర్వాత చుట్టుపక్కల చిన్న దుకాణాలు తయారయ్యాయి. అప్పడు పేరుగాంచిన షాపులన్నీ ఇప్పుడు పాతబడ్డాయి. పుణే నగరంలో కొత్త కాలేజీలు ఏర్పడడంతో పాటు సిటీకి కొత్త స్టూడెంట్లు వస్తున్నారు. వారు కొత్తగా పెట్టిన షాపుల వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. దీనికి కారణం ఆ దుకాణాలు పాతబడినట్లు కనిపించడం. దీంతో అలెఫియాకు ఒక ఐడియా తట్టింది. ఈ ఆలోచనను తన ఫ్రెండ్ అనుష్కతో పంచుకున్నది. ఇద్దరూ కలిసి బాగా ఆలోచించి ఒక ప్రాజెక్ట్‌ను చేపట్టారు. దీని పేరు ఎ ఫ్రెష్ కోట్. 1937లో గులామ్‌హుస్సెన్ మహ్మద్ భాయ్ మొట్టమొదటి బైండింగ్ షాప్ పెట్టాడు. హుస్సెన్‌తో పాటు పాత దుకాణాల యజమానులందరినీ కలిసి ఎ ఫ్రెష్ కోట్ ప్రాజెక్ట్ గురించి వివరించారు. కస్టమర్లను ఆకర్షించేలా చేస్తామంటే ఎవరూ మాత్రం వద్దంటారు. అందరూ అంగీకారం తెలిపారు. అనుష్క, అలెషియా కొంతమందిని టీంగా ఏర్పాటు చేశారు. ఆదివారం నాడు షాపులన్నీ బంద్ చేస్తారు. ఆ రోజే వీరు పని మొదలుపెట్టారు. ఉదయం 5 గంటలు మొదలు రాత్రి వరకు ఒకటి కూడా వదలకుండా వరుసగా షాపునకు తగ్గట్టుగా వారి ఆర్ట్స్ ఉంటాయి. ఏ షాపుకు ఎలాంటి ఆర్ట్ వేయాలో ముందుగానే టీం సభ్యులు చర్చించుకుంటారు. ఇలా మొదటి ఆదివారం నాడు 20 షట్టర్లకు పెయింటింగ్ వేశారు. మొదటిసారికి అయిన ఖర్చంతా వీరే భరించారు. రెండవ సారి ఆర్ట్ వేయడానికి స్పాన్సర్లు ముందుకు వస్తున్నారని అనుష్క చెప్పుకొచ్చింది.

508
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles