అరుదైన అవకాశం


Fri,July 12, 2019 12:59 AM

Ila-cheddam
భారతీయ వైదిక భక్తులకు, ప్రత్యేకించి శ్రీమహావిష్ణువు ఆరాధకులకు విశేష ఫలాన్నిచ్చేది చాతుర్మాస్య వ్రతం. దీర్ఘకాలం పాటు (నాలుగు నెలలు) భగవత్ సేవలో నిమగ్నమయ్యే అరుదైన అవకాశం దీనివల్ల కలుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి (తొలి ఏకాదశి/ శయన ఏకాదశి) నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి (ప్రబోధినీ ఏకాదశి) వరకు సుమారు 120 రోజుల వరకు ఏకధాటిగా ఇది కొనసాగుతుంది. ఈ దీక్షను నిష్ఠాగరిష్టులు ఎవరైనా స్వీకరించవచ్చు. దీక్ష ప్రారంభానికి అనువైన రోజులుగా తొలి ఏకాదశి, గురుపూర్ణిమలను వేద పండితులు చెప్తారు. ఎక్కువమంది గురుపూర్ణిమనాడే దీక్షను స్వీకరిస్తుంటారు.

కానీ, తొలి ఏకాదశి రోజు మొదలుపెట్టి ప్రబోధినీ ఏకాదశి నాడు ముగించడమే ఉత్తమ పద్ధతిగా వారు సూచిస్తున్నారు. ఈ కాలమంతా దీక్షాపరులకు ప్రతి రోజూ విధిగా బ్రహ్మచర్యం, ఒంటిపూట భోజనం, ఉన్న ఊరు సరిహద్దులు దాటక పోవడం, సూర్యోదయ వేళకు ముందే స్నానం వంటివి తప్పనిసరి అని, మంత్రానుష్ఠానం, దానాది పుణ్యకార్యాలు ఆచరించాలని వారు సూచిస్తున్నారు. దీనివల్ల వందరెట్లు అధిక ఫలం లభిస్తుందని శాస్ర్తాలు చెబుతున్నాయి.

597
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles