కిచెన్ కార్న్ ర్!


Thu,July 11, 2019 01:30 AM

CORN
ఇవాళ వంటేంటి? అదే వేపుడు.. అదే పప్పు.. అదే కూర! ఏదైనా వెరైటీ ట్రై చేయొచ్చు కదా? అని బోర్ కొట్టేదాక చూడకండి! మాన్‌సూన్‌లో మజానిచ్చేలా కార్న్‌తో కసరత్తులు ఎందుకు చేయొద్దు? రొటీన్ ఫుడ్‌కు అడ్డాగా మారిన మీ కిచెన్‌ను
కార్న్ కరకరలతో పేర్చి.. వండి.. వార్చి.. వడ్డన కూర్చి రెడీగా ఉంది కిచెన్ కార్న్‌ర్.! ఆరగించి.. ఆస్వాదించండి!!


కార్న్ వడ.. స్వీట్ పాయసం

CORN-VADA-SAGOSWEET

కావాల్సినవి :

కార్న్ : ఒక కప్పు
పచ్చిమిర్చి : 4
జీలకర్ర : పావు టీస్పూన్
ఉల్లిపాయ ముక్క : 1, సాబుదానా : అర కప్పు
యాలకుల పొడి : అర టీస్పూన్
బెల్లం : పావు కప్పు, పాలు : 300 మి.లీ.
కరివేపాకు : ఒక రెమ్మ, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కార్న్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు వేసి మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపాలి.
స్టెప్ 2 : కడాయిలో నూనె పోసి ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ 3 : ఇప్పుడు సాబుదానా పాయసం దీనికి పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది. దానికోసం సాబుదానాని అరగంట పాటు నీళ్లలో వేసి నానబెట్టాలి.
స్టెప్ 4 : గిన్నెలో సాబుదానాలో కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. ఇందులో యాలకుల పొడి, బెల్లం తురుము, పాలు పోసి కలుపుకోవాలి.
స్టెప్ 5 : ఈ పాయసం చిక్కగా అయ్యేంత వరకు ఉంచి దించేయాలి. వడ, పాయసం కలిపి తింటే మహా రుచిగా ఉంటాయి.

కార్న్ గ్రిల్ సాండ్‌విచ్

CORN-GRILL-SANDWICH

కావాల్సినవి :

స్వీట్‌కార్న్ : ఒక కప్పు
మిరియాల పొడి : ఒక టీస్పూన్
చీజ్ : అర కప్పు
బ్రెడ్ ైస్లెసెస్ : 4
మయనీస్ : అర కప్పు
బటర్ : అర కప్పు
ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కడాయిలో బటర్ వేసి స్వీట్ కార్న్, మిరియాల పొడి, ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు వేయించాలి.
స్టెప్ 2 : దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో చీజ్ వేసి బాగా కలుపాలి. ఇప్పుడు బ్రెడ్ ైస్లెస్‌ని తీసుకొని మయనీస్ అప్లయ్ చేయాలి.
స్టెప్ 3 : దీని మీద కార్న్ స్టఫ్ పెట్టాలి. పై నుంచి మళ్లీ కాస్త చీజ్ వేయాలి. ఇప్పుడు మరో బ్రెడ్ ైస్లెస్ పెట్టి పై నుంచి బటర్ వేయాలి.
స్టెప్ 4 : ఈ బ్రెడ్ ముక్కలని బ్రెడ్ టోస్టర్‌లో పెట్టి 2 నుంచి 3 నిమిషాలు గ్రిల్లింగ్ చేయాలి. వీటిని త్రిభుజాకారంలో కట్ చేసి లాగించేస్తే ఆ టేస్టే వేరు.

స్వీట్ కార్న్ పుడ్డింగ్

SWEET-CORN-PUDDING

కావాల్సినవి :

స్వీట్ కార్న్ ప్యూరీ : పావు కప్పు
స్వీట్ కార్న్ : పావు కప్పు
కార్న్‌మీల్ ఫ్లోర్ : ఒక టీస్పూన్
మైదా : ఒక టీస్పూన్
కోడిగుడ్డు : 1
చక్కెర : 3 టేబుల్‌స్పూన్స్
పాలు : పావు కప్పు
బటర్ : 2 టీస్పూన్స్

తయారీ :

స్టెప్ 1 : ముందుగా పాలను వేడి చేసి చల్లారబెట్టాలి. ఒక గిన్నెలో కోడిగుడ్డు, చక్కెర వేసి బాగా గిలక్కొట్టాలి.
స్టెప్ 2 : ఈ గుడ్డు మిశ్రమంలో పాలు పోసి బాగా కలుపాలి. ఆ తర్వాత కార్న్ ప్యూరీ, స్వీట్ కార్న్, కార్న్‌మీల్ ఫ్లోర్, మైదా వేసి ఉండలు కట్టకుండా కలుపుతుండాలి.
స్టెప్ 3 : బేకింగ్ ట్రేకి బటర్ రాసి ఈ మిశ్రమాన్ని మొత్తం పరుచాలి. దీన్ని ఓవెన్‌లో 180 డిగ్రీల వద్ద 20 నుంచి 30 నిమిషాల పాటు బేక్ చేయాలి.
స్టెప్ 4 : బేక్ చేసిన ఈ మిశ్రమాన్ని నీట్‌గా బయటకు తీయాలి. పైన వీలుంటే డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి తింటే మరింత టేస్టీగా ఉంటుంది.

కార్న్ జడే సూప్

CORN-JADE-SOUP

కావాల్సినవి :

స్వీట్ కార్న్ : అర కప్పు, పాలకూర : ఒక కట్ట,
కొత్తిమీర : చిన్న కట్ట, క్యాప్పికం ముక్కలు : పావు కప్పు,
పచ్చిమిర్చి : 1, సెలరీ : చిన్న కట్ట, ఉల్లి ఆకు : 1,
వెల్లుల్లిపాయలు : 4, క్యారెట్ ముక్కలు : పావు కప్పు,
ఫ్రెంచ్ బీన్స్ : పావు కప్పు, కార్న్ స్టార్చ్ : ఒక టేబుల్‌స్పూన్,
నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : పాలకూర కడిగి పెట్టుకోవాలి. కడాయిలో పాలకూర వేసి వేయించాలి. ఇందులో కొత్తిమీర వేసి కలుపాలి.
స్టెప్ 2 : ఇవి కాస్త పచ్చివాసన పోయాక.. ఇందులో క్యాప్సికం ముక్కలు, పచ్చిమిర్చి, సెలరీ వేసి కలిపి దించేయాలి. వీటిని మిక్సీ పట్టి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి.
స్టెప్ 3 : కడాయిలో కొద్దిగా నూనె పోసి వెల్లుల్లి, ఉల్లి ఆకు, క్యారెట్ ముక్కలు, బీన్స్, స్వీట్ కార్న్ వేసి బాగా కలుపాలి. ఇవి కాస్త వేగాక.. పాలకూర పేస్ట్ వేసి కలుపాలి.
స్టెప్ 4 : కాసేపు కలిపాక.. కొన్ని నీళ్లు పోసి, చక్కెర వేసి కలుపాలి. కాసేపు ఈ మిశ్రమాన్ని మరుగనివ్వాలి. ఆ సమయంలోనే కార్న్‌స్టార్చ్ వేసి మరో రెండు నిమిషాలు సన్నని మంట మీద ఉంచి దించేయాలి. వేడి సూప్ రెడీ!

కార్న్ సర్వపిండి

SARVA-PINDIWITHINDIAN-C

కావాల్సినవి :

కార్న్ : ఒక కప్పు
అల్లం : చిన్న ముక్క
జీలకర్ర : పావు టీస్పూన్
పచ్చిమిరపకాయలు : 4
బియ్యం పిండి : పావు కప్పు
ఉల్లి ఆకు ముక్కలు : ఒక కప్పు
కొత్తిమీర : ఒక కట్ట
క్యారెట్ తురుము : 2 టేబుల్‌స్పూన్స్
ఉల్లిపాయ ముక్కలు : ఒక కప్పు
నూనె : 2 టీస్పూన్స్
ఉప్పు : తగినంత

తయారీ :

స్టెప్ 1 : కార్న్, అల్లం ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి అన్నీ కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి.
స్టెప్ 2 : దీన్ని ఒక గిన్నెలో వేసుకొని బియ్యం పిండి, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లి ఆకు, కొత్తిమీర, క్యారెట్, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపాలి.
స్టెప్ 3 : ఒక గిన్నె తీసుకొని కొద్దిగా నూనె పోసి గిన్నె మొత్తం రాయాలి. ఇప్పుడు పిండిని తీసుకొని ఆ గిన్నె అచ్చు ఎలా ఉంటుందో అలా మొత్తం ఒత్తాలి. మధ్యలో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి.
స్టెప్ 4 : ఈ గిన్నెను స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద పది నిమిషాల పాటు ఎర్రగా కాల్చుకోవాలి. అంతే.. టేస్టీ సర్వ పిండి మీ ముందుంటుంది.

-సంజయ్ తుమ్మ
-సెలబ్రిటీ చెఫ్

1669
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles