సెన్సర్ల సందడి


Wed,July 10, 2019 01:57 AM

Sencer
ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాం! సూట్‌కేస్‌ను చేతితో పట్టుకోక ముందే అది వెనకాలే వస్తుంది. ఎటు వెళ్తే అటు వెంటనే వెళ్తుంటుంది. మరొకటి ఇలాంటిదే. వేలి సంజ్ఞలతో మౌస్ పాయింటర్ కదులుతుంది. ఆశ్చర్యంగా అనిపిస్తుందా? అదంతా సెన్సర్ల సందడి. ఇలాంటి సెన్సర్ల గాడ్జెట్లే ఇవి..

జాయ్‌స్టిక్‌గా..

ప్రజెంటేషన్ కంట్రోల్ చేయడానికీ, వీడియో గేమ్స్ ఆడడానికీ జాయ్‌స్టిక్స్ చాలా అవసరం. ఇంకా డ్రోన్ వాడాలంటే రిమోట్ లేనిదే పని కాదు. ఇలాంటి వాటి అన్నిటినీ కంట్రోల్ చేస్తుంది
Myo Armband. పేరులో ఉన్నట్టే దీన్ని మోచేతికి ధరించాల్సి ఉంటుంది. దీని ద్వారా మ్యూజిక్ ప్లేయర్స్, వీడియో గేమ్స్, ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్స్ అన్నిటినీ కంట్రోల్ చేయవచ్చు. ఇది ఉంటే ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు రిమోట్‌తో పని ఉండదు. దీన్ని ధరించి హ్యాండ్ మూమెంట్స్ ఇస్తే చాలు స్క్రీన్ యాక్సెస్ అవుద్ది. వీడియో గేమ్స్ ఆడేటప్పుడు రిమోట్ లేకుండానే ప్లేయర్‌ను కంట్రోల్ చేయవచ్చు. ప్రధానంగా డ్రోన్‌ను కూడా ఇది ఆపరేట్ చేస్తుంది. చేతి కదలికలను రిసీవ్ చేసుకుని డ్రోన్ మూవ్ అవుతుంది. థల్మిక్ ల్యాబ్స్ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. https://bit.ly/2XzyTxJ

Sencer1

రొబోటిక్ సూట్‌కేట్

ఒకప్పుడు ప్రయాణాలంటే పెద్ద పెద్ద బ్యాగులను మోసుకెళ్లడానికి కష్ట పడాల్సి ఉండేది. వాటికి బదులుగా ట్రాలీ ట్రావెలింగ్ సూట్‌కేస్‌లు వచ్చాయి. చక్రాలు ఉండడంతో పట్టుకొని లాగితే సరిపోతుంది. కానీ దీని కన్నా అడ్వాన్స్‌డ్ ట్రాలీ సూట్‌కేస్‌లు కూడా ఉన్నాయి. అసలు చేతితో పట్టుకోకుండానే అవి మన వెంటే వస్తాయి. మనం ఎటు వెళ్తే అటూ ప్రయాణిస్తాయి. మన వేగంతో సమానంగా మనల్ని అనుసరిస్తాయి. అది ఎలా అంటారా? అవే రొబోటిక్ సూట్‌కేస్‌లు. చాలా నగరాల్లో ఇవి వినియోగంలో ఉన్నాయి. మొబైల్ బ్లూటూత్, వైఫైతో పనిచేస్తాయి. మొబైల్‌కు, ఈ సూట్‌కేస్‌కు ప్రత్యేకమైన సెన్సర్ల సిస్టమ్ ఉంటుంది. ఈ హ్యాండ్స్ ఫ్రీ రోబొటిక్ సూట్ కేస్ గంటకు 10.9 కిమీల వేగంతో ప్రయాణిస్తుంది. దీనికి జీపీఎస్ కూడా ఉంటుంది. దీంతో దొంగలు ఎత్తుకెళ్లినా, కనిపించకుండా పోయినా ఇట్టే పట్టేయొచ్చు. ఈ సూట్‌కేస్ ద్వారా మొబైల్‌ను కూడా చార్జ్ చేసుకోవచ్ఛు. సుమారు నాలుగు గంటలపాటు చార్జింగ్ ఇస్తుంది. దీని ప్రారంభ విలువ రూ.26వేలు ఉంటుంది. వీడియో చూడాలంటే ఈ లింక్‌లోకి వెళ్లండి. https://bit.ly/2qZ58Yc
Sencer2

సింగిల్‌క్యూ..

సాధారణంగా టీవీనో, ఏసీనో కంట్రోల్ చేయాలంటే రిమోట్ కచ్చితంగా ఉండాల్సిందే. కానీ సింగిల్‌క్యూ singlecue సెన్సర్ గాడ్జెట్ ఉందనుకోండి ఏ రిమోట్ అవసరం లేదు. రిమోట్ లేకుండా టీవీని ఆక్సెస్ చేయొచ్చు. చేతి సంజ్ఞలతో ఛానల్ మార్చడం, వాల్యుమ్ అడ్జస్ట్ చేయడం ఈ గాడ్జెట్ పని. టీవీ, డీవీడీ, సెటప్ బాక్స్ తో పాటు స్మార్ట్ హోమ్ గాడ్జెట్లనూ దీంతో కంట్రోల్ చేయొచ్చు. ఐఆర్ రిమోట్ కంట్రోల్ డివైజ్లకు. వైఫై ఉన్న డివైజ్లకు ఇది సపోర్ట్ చేస్తుంది. దీనితో ఒకే సారీ మల్టిపుల్ డివైజ్లను వేలి సైగలతోనియంత్రించవచ్చు. https://bit.ly/1uBlDlF
Sencer3

రింగ్ జీరో

కొన్ని సినిమాల్లో చేతివేలిని చెవి దగ్గర పెట్టుకొని ఫోన్లో మాట్లాడిట్టు మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అదెలా సాధ్యం అంటారా?
Orii smart ring అనే గాడ్జెట్‌ను చేతి వేలికి తగిలించుకోవాలి. అప్పుడు వేలిని కదిలిస్తే చాలు కాల్ అటోమేటిక్‌గా లిఫ్ట్ అవుతుంది. వేలికదలిక వల్ల ఫోన్ యాక్సెస్ అవుతుంది. అలాగే స్మార్ట్ ఫోన్ స్క్రీన్‌ను టచ్ చేయకుండానే ఆపరేట్ చేయాలనుకుంటే
Ring ZERO S అనే గాడ్జెట్‌తో సాధ్యం అవుతుంది. ఈ గాడ్జెట్ 12 గంటలు ఆక్టీవ్ మోడ్‌లో ఉంటుంది. 3 రోజుల బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అచ్చం రింగ్‌లాగే దీన్ని చేతి వేలికి తొడుక్కోవాలి. బ్లూటూత్ ఉన్న ఏ స్మార్ట్ ఫోన్‌ను అయినా ఆపరేట్ చేయవచ్చు. ఆప్స్ ఓపెన్ చేయడానికి, మెసేజ్ రాయడానికి ఈ హైస్మార్ట్ గాడ్జెట్ బాగా పనిచేస్తుంది. https://bit.ly/2JoqXLV
Sencer4

ఎయిర్ సెల్ఫీ

సెల్ఫీల క్రేజ్ మాములుగా లేదు.ఈ క్రేజ్‌కు తగ్గట్టుగానే సెల్ఫీల కోసం ఎన్నో గాడ్జెట్లు వస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు మైక్రోడ్రోన్ ఎయిర్ సెల్ఫీ మార్కెట్లోకొచ్చింది. ఇది కేవలం సెల్ఫీల కోసమే రూపొందిన గాడ్జెట్.
66 అడుగుల ఎత్తువరకు ఎగిరే ఈ మైక్రో డ్రోన్ బరువు కేవలం 52గ్రాములు. చక్కగా జేబులో పెట్టుకుని వెళ్లిపోయే ఈ డివైజ్ ఐఫోన్ 6, 6ఎస్, 7,7ఎస్ ,హువావి పి9 సహా అనేక ఆండ్రాయిడ్ ఫోన్లతో వినియోగించవచ్చు. ఎయిర్ సెల్ఫీ యాప్‌తో దీన్ని ఆపరేట్ చేయవచ్చు.
Sencer5

కీ బోర్డు అక్కర్లేదు..

కంప్యూటర్ ఆపరేట్ చేయాలంటే కీబోర్డు తప్పనిసరి, మౌస్ లేకపోతే పనవ్వదు. కీబోర్డు, మౌసుల్లో కార్డ్‌లెస్, హోలోగ్రామ్ కీబోర్డులు ఉన్నాయి. ఇప్పుడు వాటితో పని లేదంటున్నది జెస్ట్ సెన్సర్ కీ బోర్డు. ఈ గాడ్జెట్ ఉంటే మనం గాల్లో టైప్ చేసినా కంప్యూటర్ రిసీవ్ చేసుకుంటుంది. నాలుగు వేళ్లకు తగిలించుకునే రింగులు, అరచేతిపై అమర్చుకుని పట్టీలతో కూడిన జెస్ట్లో యాక్సెలరోమీటర్లు, గైరో స్కోపులు, మాగెటో మీటర్లు ఇలా బోలెడు సెన్సర్ ఆబ్జెక్ట్లు ఈ గాడ్జెట్‌లో ఉన్నాయి. మన వేలి కదలికలను బట్టి అక్షరాలను అంచనా వేసి కమాండ్‌ను కంప్యూటర్‌కు అందిస్తుంది. స్మార్ట్ ఫోన్లో మాదిరిగా ప్రీడిక్టివ్ టెక్స్‌టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. మౌస్ బటన్‌ను డబుల్ క్లిక్ చేసినట్టు, లేదా కీబోర్డ్ షార్ట్‌కట్ల తీరులో ఒక బటన్ ప్రెస్ చేసినప్పుడు నిర్దిష్టమైన పని జరిగేట్టు కూడా పని చేస్తుంది. బ్లూటూత్ ఉన్న ఏ డివైజ్‌కు అయినా జెస్ట్ కనెక్ట్ అవుతుంది. ఈ కీబోర్డ్ ఎలా పని చేస్తుందో చూడాలంటే క్లిక్ చేయండి : https://bit.ly/30osRBS

- వినో..

511
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles