ఆకట్టుకొనేందుకు మరో ఐదు ఫీచర్లు


Wed,July 10, 2019 01:47 AM

whatsapp
వాట్సాప్ తన వినియోగదారులను ఎప్పటికప్పుడూ ఆకర్షిస్తున్నది. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచే అనేక ఫీచర్లును జోడించి ఆశ్చర్యపరిచింది. తాజాగా మరికొన్ని ఫీచర్లను కూడా వాట్సాప్ యాడ్ చేయబోతున్నది.

1 హైడ్ మ్యూటెడ్ స్టేటస్ : ఆండ్రాయిడ్ బీటా 2.19.183 అప్‌డేట్‌లో ఈ ఫీచర్ రానుంది. మామూలుగా కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారి స్టేటస్‌లు మనకు కనిపిస్తాయి. అందులో ఎవరివి అవసరం లేదో వారివి మ్యూట్ చేసుకొనే ఫీచర్ ఉంది. కానీ హైడ్ ఆప్షన్ లేదు. ఈ ఫీచర్‌తో హైడ్ కూడా సాధ్యం అవుతుంది.

2 ఫింగర్ ఫ్రింట్ లాక్ : ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ ఓపెన్ చేయడానికి ఫింగర్ ప్రింట్ అన్‌లాకింగ్ సిస్టమ్ టెస్టింగ్ దశలో ఉంది. ఇది మరింత సెక్యూరిటీ ఇస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం Face Unlock ఫీచర్ ను కూడా తీసుకురావాలని చూస్తున్నది వాట్సాప్.

3 షేర్ వాట్సాప్ స్టేటస్ : ఈ ఫీచర్ వాట్సాప్ యూజర్లందరికీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, జీమెయిల్, గూగుల్ ఫొటోల నుంచి యూజర్ల స్టేటస్ ను షేర్ చేసుకోవచ్చు. డేటా షేరింగ్ API ద్వారా iOS, ఆండ్రాయిడ్ డివైజ్ ద్వారా యూజర్ల స్టేటస్‌ను ట్రాన్‌ఫర్ చేసుకోవచ్చు.

4 ర్యాంకింగ్ ఆఫ్ కాంటాక్ట్స్ : ఈ ఫీచర్ కూడా త్వరలో యూజర్లకు అందుబాటులోకి రానుంది. ఫేవరెట్ కాంటాక్టు లిస్టును ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే.. ర్యాంకింగ్ ఆఫ్ కాంటాక్టులుగా సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్‌గా మీ వాట్సాప్ కాంటాక్టులు టాప్ లిస్టులో కనిపిస్తాయి.

5 డార్క్ మోడ్ : ఈ ఫీచర్ గురించి ప్రత్యేకించి యూజర్లకు చెప్పనక్కర్లేదు. ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉంది. త్వరలో వాట్సాప్ లో కూడా డార్క్ మోడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉంది.

2889
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles