పోయిన ఫోన్‌ను కనిపెట్టవచ్చు!


Wed,July 10, 2019 01:40 AM

trace
ఎంతో ఇష్టపడి, వేల రూపాయలు వెచ్చించి మొబైల్ కొంటాం. ఒక్కోసారి మన నుంచి అది మిస్ అవుతుంది. తిరిగి పొందడం కొంత కష్టమే అవుతుంది. పోయిన ఫోన్లు చాలా అరుదుగా కనిపెట్టగలం. ఎవరైనా ఫోన్లు దొంగిలిస్తే దాన్ని పట్టుకోవడం చాలా కష్టమనే చెప్పాలి. నెట్ వర్క్ ద్వారా కనిపెట్టే అవకాశం ఉన్నా SIM కార్డు తొలగిస్తే పరిస్థితి ఏంటో తెలియదు? కానీ రానున్న రోజుల్లో దీనికి పరిష్కారం దొరకనుంది. పోయిన లేదా దింగతనానికి గురైన ఫోన్లను ట్రేస్ చేయడానికి సెంటర్‌ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ప్రభుత్వ సంస్థ ట్రాకింగ్ సిస్టమ్‌ను ప్రకటించింది. SIM కార్డు తొలగించినా ఫోన్ కనిపెట్టడం చాలా సులువుగా ఉండేలా ఇది పని చేస్తుంది. ఆగస్టులో ట్రాకింగ్ సిస్టమ్ టెక్నాలజీని లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది. దేశంలో ఎక్కడైనా మీ మొబైల్ ఫోన్ దొంగతనానికి గురైనా, పోగొట్టుకున్నా సరే ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా వెంటనే కనిపెట్టవచ్చు.

2944
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles