వారానికి మూడ్రోజులు వీకాఫ్‌తో ఉత్తమ ఫలితాలు


Wed,July 10, 2019 12:59 AM

ఇండియాలో ఒక ఉద్యోగి వారానికి ఆరు లేదా అయిదు రోజులు.. రోజుకు ఎనిమిది గంటలు పనిచేయాల్సిందే! నెలకు ఒకటో రెండో సెలవులు. ఇదే చాలామంది ఉద్యోగుల జీవితం. కానీ వారానికి 3 రోజులు వీక్లీఆఫ్ ఇస్తున్నాయి అమెరికా, బ్రిటన్‌లోని కొన్ని కంపెనీలు. ఈ విధానంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగుల పనితనం మెరుగుపడిందని ఇటీవల కొందరు యువ ఉద్యోగులపై చేసిన సర్వేలో తేలింది.
office-staff
బ్రిటన్, అమెరికా సహా 8 దేశాల్లోని 3 వేల మంది యువ ఉద్యోగులపై ఇటీవలఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో వారానికి మూడ్రోజులు వీకాఫ్ ఇస్తే ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి. ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఎలా ఉంటున్నారు. కంపెనీ, ఆఫీసు సమయాల్లో వ్యక్తిగత వ్యవహారాలపై దృష్టి పెడుతున్నారా అనే అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో కొన్ని ఆసక్తికర అంశాలు బయటికి వచ్చాయి. ఉద్యోగులకు ఎక్కువ వీకాఫ్‌లు ఇస్తే వారు తమ సొంత సమస్యల్ని పరిష్కరించుకుని ఆఫీసుకు ఫ్రెష్ మూడ్‌తో వస్తారని తేలింది. వేగంగా తప్పులు, పొరపాట్లు జరగకుండా పనిచేస్తారని సర్వేలో తెలిసింది. మానసిక నిపుణులు సైతం మూడు రోజులు వీకాఫ్ ఇస్తే మంచిదని అంటున్నారు. ఇంటియాలో మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుందనీ మూడురోజులు వీకాఫ్ ఉంటే ఉద్యోగుల్లో టెన్షన్లు తగ్గి మానసికంగా ఫిట్‌గా ఉంటారని ఉద్యోగ సంఘాలు సైతం మూడ్రోజుల వీకాఫ్ విధానానికి మద్దతు పలుకుతున్నాయి.

530
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles