ఆఫీస్‌కు హైహీల్స్ వేసుకుని వెళ్లండి..


Wed,July 10, 2019 12:58 AM

ఇది వరకు పార్టీలకు, ఫంక్షన్లకు మాత్రమే హై హీల్స్ వేసుకునే వారు. ట్రెండ్ మారింది. ఆఫీస్‌కు కూడా హై హీల్స్ వేసుకుని వెళుతున్నారు. కాస్త ట్రెండీగా, ఫ్యాషన్‌ను ప్రతిబింబించే విధంగా ఉన్న హై హీల్స్ ఇప్పుడు ఎంతో హుందాతనాన్ని తెచ్చిపెడుతున్నాయి.
trending-boots
హైహీల్స్ ఎప్పటి నుంచో ఉన్నవే. కానీ ఇటీవల కొన్ని హై హీల్స్ ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ముఖ్యంగా కార్యాలయాల్లో ఉన్నతాధికారులు(పురుషులు) ఫార్మల్ షూ వేసుకుంటారు. మరి మహిళా అధికారులు ఎందుకు ఫార్మల్ షూ ధరించవద్దు! అవీ పురుషుల షూలను పోలినవే అయి ఎందుకు ఉండవద్దు. అదే కోణంలో ఆలోచించి కొన్ని షూ కంపెనీలు షూలు తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం నగరాల్లో మహిళలు హుందాగా కనిపించేందుకు ఫార్మల్ హైహీల్స్ వేసుకుంటున్నారు. వర్షాకాలం రోడ్లపై నిలిచే నీటి ఇబ్బందుల నుంచి కూడా ఈ షూలు రక్షణ కల్పిస్తున్నాయని మహిళలు చెబుతున్నారు. రూ. 5 వందల నుంచి రూ. 2 వేల వరకు ఈ షూలు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ప్రముఖ ఆన్‌లైన్ బిజినెస్ సంస్థలు వీటిని 50 శాతం డిస్కౌంట్‌తో కూడా అందిస్తున్నాయి.

624
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles