అభిమానం హైదరాబాద్‌కు రప్పించింది


Wed,July 10, 2019 12:57 AM

అభిమానం సరిహద్దుల్ని దాటి వచ్చేలా చేసింది. అభిమాన నటుడిని చూసేందుకు ఎంత ఖర్చు అయినా పర్లేదు. అంటూ కొందరు జపనీయులు ఇటీవల హైదరాబాద్ బాటపట్టారు. ప్రభాస్ ఇంటి ఎదుట ఫొటోకు ఫోజిచ్చారు జపాన్ పౌరులు.
PRABHAS-HOME
బాహుబలి సిరీస్‌తో రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మరింత పెరిగింది. కేవలం ఇండియాలోనే కాదు.. విదేశాల్లోనూ ప్రభాస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇటీవల జపాన్‌కు చెందిన కొంతమంది అమ్మాయిలు హైదరాబాద్‌లోని ప్రభాస్ ఇంటి ఎదుట హడావుడి చేశారు. ఫిల్మ్‌నగర్‌లోని ప్రభాస్ ఇంటి మెయిన్ గేట్ ఎదుట నిలబడి ఫొటోకు ఫోజిచ్చారు. ప్రభాస్ నటించిన సెన్సేషనల్ బాహుబలి సిరీస్‌కు జపాన్‌లో విశేష స్పందన వచ్చింది. ఆ సినిమా విడుదల సమయంలో బాహుబలి టీమ్ స్వయంగా అక్కడకు వెళ్లి మరీ ప్రచార కార్యక్రమాలు చేసింది. ఈ సిరీస్‌తో ప్రభాస్‌కు జపాన్‌లో విపరీతంగా ఫ్యాన్స్ పెరిగిపోయారు. అయితే జపాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఫ్యాన్స్ ప్రభాస్‌ను కలిసేందుకు ప్రయత్నించగా ప్రభాస్ షూటింగ్ బిజీలో ఉండి కలవలేకపోయారని అయినా ఆనందంగా ప్రభాస్ ఇంటి ఎదుట ఫొటో దిగామని ప్రకటించారు. సోషల్ మీడియాలో ఈ ఫొటో బాగా వైరల్ అవుతున్నది. మొత్తానికి అభిమానం సరిహద్దుల్ని దాటించి హైదరాబాద్ బాట పట్టించింది.

801
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles