గాలితోనే బతికేస్తున్నది!


Wed,July 10, 2019 12:57 AM

ఆమె గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నది. దాన్నే ఆంగ్లంలో బ్రీతరియనిజం అంటారు. కానీ కొన్ని షరతులకు లోబడాల్సిందే. అవేంటంటే గాలితో పాటు అప్పుడప్పుడు టీ, జ్యూస్‌లు కూడా తాగడం. ద్రవ పదార్థాలు తాత్కాలికంగా మాత్రమే ఆకలి తీరుస్తాయి. అయినా ఆమె హ్యాపీగా బతకడం వెనుక కారణమేంటంటే..
ADURA
30 ఏండ్ల అదురా స్వస్థలం అమెరికాలోని మిన్నెయాపోలీస్. ఈమె గత 97 రోజులుగా గాలిని మాత్రమే పీలుస్తూ జీవిస్తున్నది. ఫిట్‌నెస్ కోసం ఎన్నో రకాల ఆహారాన్ని ప్రయత్నించి విసిగిపోయింది. చివరికి బ్రీతరియనిజం (గాలిని పీలుస్తూ బతికేయడం) గురించి తెలుసుకుంది. ఇండియాలో యోగా, ధ్యానం చేసేవారు ఎక్కువగా శ్వాసతో శరీరాన్ని అదు పు చేస్తుంటారనే విషయాన్ని తెలుసుకున్న ఆమె దాన్నే డైట్‌గా పాటించడం మొదలు పెట్టిం ది. ఈమె డైట్ గురించి తెలుసుకున్న వైద్యులు గాలిని పీలుస్తూ బతకడం చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. శరీరానికి తగిన శక్తి లభించాలంటే పోషకాలు అందాలని సూచించారు. ఈ నేపథ్యంలో అదురా అప్పుడప్పుడూ టీ, పండ్ల జ్యూస్‌లను తాగుతూ శరీరం నిమంత్రణ కోల్పోకుండా జాగ్రత్త పడుతున్నది. అయితే తన మాదిరిగా ఎవ్వరూ ప్రయత్నించవద్దని, ఫిట్‌నెస్ కోసం కడుపు మాడ్చుకోవద్దని అదురా చెబుతున్నది. తప్పకుండా వైద్యుల సలహా ప్రకారం మాత్రమే డైట్ పాటించాలని ఆమె పేర్కొంటున్నది.

1359
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles