టెడ్.. ఓ చిలుకల రాజు!


Sun,July 7, 2019 01:15 AM

అర్నెల్లు దోస్తానా చేస్తే.. వాళ్లు వీళ్లుగానూ, వీళ్లు వాళ్లుగానూ మారిపోతారని ఓ నానుడి ఉన్నది. అందుకు ఉదాహరణే ఈ వ్యక్తి. మొదట్లో చిలుకలతో దోస్తీ జేసి, ఇప్పుడు చిలుకలా మారేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ముక్కు, రెక్కలు ఒక్కటే తక్కువ.. తన శరీరాన్నంతా చిలుకలా మార్చేశాడు.
birds-king
మొదటి ఫొటోలోని వ్యక్తే.. రెండో ఫొటోలో ఉన్నది. చూశారుగా ఎంత తేడా కనిపిస్తున్నదో. ఇతని పేరు టెడ్ రిచర్డ్స్. ఇంగ్లాండ్‌లోని బ్రిస్టల్‌కు చెందిన టెడ్‌ను అందరూ మాట్లాడే చిలుక అంటారు. అతని గురించి తెలిసిన అతికొద్ది మంది మాత్రం పక్షులను ప్రేమించే పక్షిరాజు అంటుంటారు. టెడ్‌ను చూడగానే గ్రహాంతరవాసిలా కనిపిస్తాడు. పరీక్షగా చూస్తే మాత్రం అతడి ముఖంపై చిలుక ఈకలను తలపించే టాటూలు కనిపిస్తాయి. చిలుకలపై ఉన్న ప్రేమతో రిచర్డ్ తన పేరును టెడ్ ప్యారట్‌మ్యాన్‌గా మార్చుకున్నాడు. టెడ్ నిత్యం చిలుకలతో కలిసి వీధుల్లో తిరుగుతూ ఉంటాడు. ఇక చిలుకలా మాట్లాడేందుకు చెవులు కట్ చేసుకున్నాడు. నాలుకను రెండుగా చీల్చుకొని చిలుకలా మారేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ముఖం మొత్తం రింగులు, టాటూలు వేయించుకున్నాడు.

ఇక నిత్యం చిలుకలతోనే సావాసం. పొద్దుగాలే చిలుకలకు ఆహారం పెడితేగానీ అతడు తిండి ముట్టడు. 58 ఏళ్ల టెడ్.. యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఓ షూ ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. అప్పట్లో సరదాగా శరీరంపై టాటూలు వేసుకునేవాడు. అయితే రెండేండ్ల నుంచి అతడు పక్షిలా మారేందుకు ప్రయత్నిస్తున్నాడు. చెవులు మాత్రమే కాకుండా తన నాలుకను కూడా రెండుగా చీల్చుకుని ఆశ్చర్యపరిచాడు. ఇప్పటివరకు టెడ్ తన శరీరంపై 110 టాటూలు పొడిపించుకున్నాడు. 50కి పైగా కుట్లు, రింగులతో శరీరంలోని భాగాలను మార్పు చేసుకున్నాడు. టెడ్ పెంచుకుంటున్న చిలుకలు అతను చెప్పినట్లే వింటాయి. అతను ఏది చేసినా.. తిరిగి చేస్తాయి. ఏది ఏమైనా పక్షులంటే ప్రేమ ఉండొచ్చుగానీ, ఇలా పక్షిలా మారిపోయేంత ప్రేమ ఉంటే మాత్రం కష్టమే కదా!

910
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles