బాటిల్ క్యాప్ చాలెంజ్.. ట్రై చేస్తారా?


Sun,July 7, 2019 01:15 AM

సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రకరకాల చాలెంజ్‌లు చూశాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన బాటిల్ క్యాప్ చాలెంజ్ దుమ్మురేపుతున్నది. ఈ సరికొత్త చాలెంజ్‌లను ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సెలబ్రెటీలు ట్రై చేస్తున్నారు.
Bottle-Cap-Challenge
ఇటీవలి కాలంలో రకరకాల చాలెంజ్‌లు నెటిజన్లకు మంచి స్ఫూర్తిని కలిగించాయి. వాటిలో ఐస్ బకెట్, రైస్ బకెట్ చాలెంజ్ వంటివి సెలబ్రిటీలను సైతం ఆకర్షించాయి. అదే కోవలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌గా నిలుస్తున్న చాలెంజ్ బ్యాటిల్ క్యాప్ చాలెంజ్ (#bottlecapchallenge). ఇది ఫిట్‌నెస్‌కు ఓ అగ్నిపరీక్షగా నిలిచింది. ప్రస్తుతం ఈ చాలెంజ్‌ను హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సవాల్‌గా స్వీకరిస్తున్నారు. ఇంతకు బాటిల్ క్యాప్ చాలెంజ్ ఏమిటంటే.. బాటిల్ క్యాప్‌ను చేతితో కాకుండా కాలితో కిక్ కొట్టి తీయాల్సి ఉంటుంది. ఈ పోటీలో బాటిల్ కింద పడకూడదు.

కేవలం కాలితో తన్ని మాత్రమే మూతను తీయాలి. ఇప్పటికే ఈ చాలెంజ్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, సౌత్ స్టార్ అర్జున్ సర్జా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. ఈ చాలెంజ్‌లో చాలా యంగ్‌గా, ఫ్రెష్‌గా కనిపించిన అర్జున్.. బాటిల్ మూతను కిక్‌తో ఎగరగొట్టి తన స్టామినాను నిరూపించుకున్నాడు. ఇక అక్షయ్ కుమార్ కూడా చాలా ైస్టెలీష్‌గా ఫినిష్ చేశాడు. దీని సృష్టికర్త అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్‌షిప్ టైటిల్ విన్నర్ మ్యాక్స్ హాల్లోవే. ఇతని చాలెంజ్‌ను ప్రముఖ సింగర్ జాన్ మేయర్ స్వీకరించాడు. అలా పాకుతూ వస్తోన్న ఈ చాలెంజ్.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది.

711
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles