దేశం మెచ్చిన ఆర్టిస్ట్..


Sun,July 7, 2019 01:14 AM

బాలీవుడ్‌లో సువిగ్య శర్మ తెలియని వారుండరు. తన ఏడో యేట నుంచే కుంచెతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. సువిగ్య శర్మ సెలబ్రెటీ పెయింటర్‌గా ఫేమస్ అయిపోయాడు. ఇటీవలే మోదీ చిత్రపటాన్ని కాన్వాస్ పై ఆవిష్కరించడంతో దేశ నలుమూలల నుంచి ప్రశంసలందాయి.
Suvigya-Sharma
ఏడేండ్ల వయసు నుంచే చిత్రాలు గీస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సువిగ్య శర్మ. ఈయన తండ్రి, తాతయ్యలు సైతం గొప్ప చిత్రకారులు. 80 ఏళ్ల కుటుంబ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శర్మ.. ఆధునిక పద్ధతుల్లో అద్భుతమైన బొమ్మలు గీస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. తన చిత్రాల్లో బంగారం, విలువైన రాళ్లు, రత్నాలు పొదిగినట్లు గీసి, ప్రత్యేక రూపాన్ని తీసుకొస్తాడు. మొఘల్, తంజావూర్ పెయింటింగ్ పద్ధతులను అనుసరించి చిత్రాలు గీయడంలో సక్సెస్ అయ్యాడు సువిగ్య శర్మ. ప్రపంచంలోని కొద్దిమంది బిలీనియర్లు సైతం సువిగ్యకు క్లయింట్లుగా ఉన్నారు. ఇటీవల సువిగ్య గీసిన ప్రధాని నరేంద్ర మోదీ, టెండూల్కర్-అంజలి దంపతుల వర్ణచిత్రాలు ఆయనకు దేశవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చాయి. సువిగ్య శర్మలో మరో విశేషం ఆయన త్రీడీ పెయింటింగ్స్. అవి సహజత్వానికి అద్దం పడతాయి. తాజాగా ముంబయిలో ప్రఖ్యాతి గాంచిన సిద్దివినాయక ఆలయంలోని మూలమూర్తి చిత్రాన్ని 4 డైమెన్షియల్ వర్ణచిత్రాన్ని ఏడాదిన్నరపాటు కష్టపడి అద్భుతంగా ఆవిష్కరించాడు. దీంతో ఆసియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు శర్మ.

332
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles