మారియా మాయలో..


Sun,July 7, 2019 01:13 AM

తమిళ బిగ్‌బాస్ మూడో సీజన్‌కు కొత్తకళ వచ్చేసింది. కారణం ఈ పిల్లే. ఏం పిల్లర బాబు.. మనసు దోచేస్తుంది అంటూ తమిళ తంబీలు ఊగిపోతున్నారు. చూపులతోనే గుండెలను పిండేసే ఈ అమ్మడు.. చూపు తిప్పుకోకుండా ఉందంటూ స్క్రీన్ షాట్స్ తీసుకుని మరీ మొబైల్ ఫోన్లను నింపేసుకుంటున్నారు.
losliya-beautiful
తెలుగు బిగ్‌బాస్‌లో మూడో సీజన్ అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్నది. అయితే ఇప్పటికే మొదలైన తమిళ బిగ్‌బాస్.. అక్కడి యూత్‌కు హాట్ టాపిక్‌గా మారింది. కారణం లోస్లియా మారియాసేన్. మూడో సీజన్‌లో అడుగుపెట్టిన ఈ అమ్మడు తమిళ కుర్రాళ్ల మనస్సును దోచేస్తున్నది. అందమైన చూపులు, అమాయకత్వం నిండిన ముఖం, బుజ్జి బుజ్జి మాటలకు తంబీలు ఫిదా అవుతున్నారు. మారియా బిగ్‌బాస్ స్క్రీన్‌షాట్‌ను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ లోస్లియా ఆర్మీగా మద్దతు పలుకుతున్నారు. అయితే తమిళ బిగ్‌బాస్‌కు ఇంత అందాన్ని తీసుకొచ్చిన ఈ అమ్మడిది తమిళనాడే అయినా శ్రీలంకలోనే ఎక్కువగా పెరిగింది. అక్కడ మోడల్‌గా, ఓ చానల్‌లో న్యూస్‌రీడర్‌గా పనిచేస్తున్నది లోస్లియా. ఆమె తండ్రి పేరు మారియానేసన్. పూర్తి పేరు కంటే లోస్లియాగానే ఆమె అందరికీ సుపరిచయం. ఇంటర్మీడియట్ వరకూ తమిళనాడులోనే చదువుకున్నా.. డిగ్రీ చేసేందుకు కొలంబియా వెళ్లింది. సినిమాల్లో ప్రయత్నిస్తూ మోడల్‌గా ఎదుగుతున్న లోస్లియాకు ఈ షో బాగా ఉపయోగపడుతున్నది. తన మాటలు, ప్రవర్తనతో ఆకట్టుకుంటూ షో మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది.

460
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles