పెద్దగౌను.. స్టయిల్ అదిరెను!


Fri,July 5, 2019 02:03 AM

సెలబ్రేషన్స్‌లో వెలిగిపోవాలంటే.. సాయంత్రకాలపు పార్టీలకు ప్రత్యేకంగా నిలువాలంటే.. లాంగ్ గౌనులు తప్పనిసరి అయ్యాయి.. వెస్ట్రన్ పార్టీల్లో కచ్చితంగా కనిపించే ఈ లాంగ్ గౌన్లు.. ఇప్పుడు సంప్రదాయతను అద్దుకొని సరికొత్తగా మెరుస్తున్నాయి.. నెట్.. షిఫాన్.. బెనారస్.. ఇలా అన్ని మెటీరియల్స్‌తో సుందరంగా రూపుదిద్దుకుంటున్నాయి.. లవ్లీగా కనిపించే ఈ లాంగ్ గౌన్ల పై మీరూ ఓ లుక్కేయండి..
Fashan
డబుల్ లేయర్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. అందుకే దాన్ని హాఫ్ అండ్ హాఫ్‌లా డిజైన్ చేశాం. లైట్ పీచ్ కలర్ నెట్‌ని లాంగ్ గౌన్‌గా కుట్టాం. ఒక వైపు చిన్న గోల్డెన్ బుటీస్ వచ్చిన నెట్‌ని ఉపయోగించాం. మరో వైపు కాస్త హెవీ బుటీస్‌తో నింపేశాం.
పైన షిఫాన్‌ని అటాచ్ చేశాం. దీని మీద నుంచి నెట్ కేప్ వేసి గోల్డెన్ చమ్కీ, గోల్డ్ జరీతో హెవీగా వర్క్ చేయించాం.

నెమలి పింఛం రంగుల కాంబినేషన్‌తో ఈ డ్రెస్ కుట్టాం. పీకాక్ గ్రీన్ నెట్‌ని గౌన్‌గా కుట్టాం. పైన వరకు మాత్రం గోల్డెన్ సీక్వెన్స్, జరీతో ఆకుల డిజైన్‌తో పూర్తిగా నింపేశాం. ఫుల్ హ్యాండ్స్ మీద చెక్స్, లీవ్స్ ప్యాటర్న్ ఇచ్చాం. కింద నెట్ లేయర్ చివరన
గోల్డెన్ లేస్ అటాచ్ చేశాం. బ్లూ కలర్ షిఫాన్ లైనింగ్‌గా వేయడంతో డబుల్ షేడ్‌లో గౌన్ మరింత అందంగా కనిపిస్తున్నది


యెల్లో కలర్ షైనీ నెట్‌తో లాంగ్ గౌన్ డిజైన్ చేశాం. దీనికి గోల్డెన్ బార్డర్, దానిపై.. గోల్డ్, సిల్వర్ కాంబినేషన్‌లో వచ్చిన లేస్‌ని అటాచ్ చేశాం. కేప్ ఈ డ్రెస్‌కి అదనపు ఆకర్షణ. యెల్లో కలర్ షైనీ నెట్ మీద ముందు సీక్వెన్స్, థ్రెడ్ వర్క్‌తో హెవీగా డిజైన్ ఇచ్చాం. ఈ కేప్‌కి కట్ వర్క్ బార్డర్ అటాచ్ చేయడంతో ైస్టెలిష్‌గా కనిపిస్తున్నది.
Fashan1
రాయల్‌గా కనిపించేందుకు ఈ డ్రెస్ ఎంచుకోవాల్సిందే! మెజంటా రంగు షిఫాన్ మెటీరియల్‌ని లాంగ్ ఫ్రాక్‌గా కుట్టాం. ఒక వైపు పువ్వుల డిజైన్‌తో సీక్వెన్స్, గోల్డెన్ థ్రెడ్, గోల్డెన్ బీడ్స్‌తో హెవీగా వర్క్ చేయించాం. ఫుల్ స్లీవ్స్ మీద కూడా ఇదే వర్క్ కంటిన్యూ చేశాం. దీనికి నెట్‌తో రఫెల్ నెట్ దుపట్టా ఇచ్చాం. దానికి గోల్డెన్ లేస్ అదనపు ఆకర్షణగా నిలిచింది.

డిఫరెంట్‌గా ఉండాలనుకునేవాళ్లకు ఇది పర్‌ఫెక్ట్ చాయిస్. పీచ్ కలర్ బెనారస్ మెటీరియల్ ఫుల్ గౌనుగా కుట్టాం. స్లీవ్స్‌కి కాస్త డిఫరెంట్ డిజైన్ వచ్చిన బెనారస్‌ని వాడాం. ఇక ముందు డార్క్ పీచ్ కలర్ షిఫాన్ మెటీరియల్‌ని మల్టిపుల్ లేయర్లుగా డిజైన్ చేశాం. ముందు ఓపెన్ ఇచ్చి.. దానికి గోల్డెన్ జరీ అటాచ్ చేశాం. కింద వైపు హెవీ బీడ్స్ వచ్చిన లేస్ అటాచ్ చేయడంతో సూపర్‌గా మెరిసిపోతున్నది.

-ఫిరోజ్ , ఫ్యాషన్ డిజైనర్
-ఫిరోజ్ డిజైన్ స్టూడియో
https://www.facebook.com/firozdesignstudio/
-హైదరాబాద్
-ఫోన్ : 8142049755, 9505340228

770
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles