ఆ గ్రామాలకు పునర్జన్మనిచ్చింది!


Fri,July 5, 2019 01:58 AM

ఒకప్పుడు మద్యపానం, నిరుద్యోగంతో బాధపడుతున్న గుజరాత్‌లోని 55 గ్రామాలు ఇప్పుడు సంతోషంతో చిరునవ్వు చిందిస్తున్నాయి. అక్కడి ప్రజలు సొంతంగా వ్యాపారాలు మొదలుపెట్టి గుర్తింపు పొందుతున్నారు. దీనికంతటికీ కారణమైన సోనాల్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
sonal
ఆమె గుజరాత్‌కు చెందిన సోనాల్ రోచాని. నెలకు లక్షల్లో జీతం వచ్చే ఉద్యోగం. లగ్జరీ లైఫ్. వీటన్నింటినీ వదులుకొని కేవలం గిరిజనుల కోసం ప్రయాణం మొదలుపెట్టింది. ఒకరోజు నిండు గర్భిణి కిరోసిన్‌తో తడిసి ముద్దయి రక్షించండంటూ సోనాల్ వద్దకు వచ్చింది. మద్యం మత్తులో ఆమె భర్త ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోనాల్‌ను వెంటాడుతూనే ఉన్నది. ఈ సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వ సహాయంతో 2011 ఆగస్ట్‌లో శక్తి ఫౌండేషన్ స్థాపించింది. గిరిజన సంఘాలతో మాట్లాడి ప్రజలకు కొన్ని సదుపాయాలు కల్పించింది. కోద్వారా, సురత్ నగరంలోని ప్రజలకు హస్తకళలలను పరిచయం చేసి ఉపాధి కల్పించింది. ఇంతటితో సోనాల్ ఆగకుండా కొంతమంది వలంటీర్లతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కొన్ని పథకాలు ఏర్పాటు చేసింది. మొదటిది ప్రభుత్వ పథకం అందరికీ అందాలి. దానికోసం ప్రతి ఒక్కరికీ గవర్నమెంట్ ఫ్రూఫ్ ఉండాలి.

ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా ఇలా ప్రభుత్వ పథకాల ప్రత్యేకత తెలియజేసింది. అంగన్‌వాడి, వితంతువులకు పెన్షన్, రిటైర్‌మెంట్ పెన్షన్, ఆరోగ్యానికి సంబంధించిన పథకాలు అందరికీ అందేలా చేసింది. ఆరోగ్యం పేరుతో సోనాలికి తెలిసిన ఫ్రెండ్స్, బంధువుల్లోని వైద్యుల సాయంతో అన్ని గ్రామాలకు ఉచిత వైద్యం అందించింది. స్కూల్లోని విద్యార్థులకు మంచి ఆహారం ఏర్పాటు చేస్తున్నది. ఈ సంస్థ ద్వారా 500 మంది ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ బీమా పథకం కార్డు పొందారు. నెలవారీ పరిశుభ్రత ఋతుక్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేస్తున్నది. విద్య పథకంతో 46 లోకల్ స్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు అందించడంతో పాటు వలంటీర్లు చదువు కూడా చెబుతున్నారు. మిషన్ మంగళం పథకంతో గుజరాత్ ప్రభుత్వం మహిళలకు కొన్ని రంగాలలో హస్తకళల శిక్షణ ఇస్తున్నది. వీరికి 5 లక్షల వరకు ఫండ్స్ ఇవ్వడానికి బ్యాంకు ఆదేశాలను జారీ చేసిందని సోనాల్ చెబుతున్నది. వచ్చిన డబ్బుతో వారు సొంతంగా అగర్బత్తీలు, హ్యాండ్‌క్రాఫ్ట్స్, బ్యూటీ పార్లర్, పాపడాల తయారీ వంటి పనులను బిజినెస్‌గా మార్చుకున్నారు. ఈ ఎనిమిదేండ్లలో గుజరాత్‌లోని 55 గ్రామాలకు పునర్జన్మనిచ్చిన సోనాల్‌కు అక్కడి ప్రజలందరూ కృతజ్ఞతలు చెబుతున్నారు.

429
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles