అతి అనర్థమే..


Fri,July 5, 2019 01:57 AM

స్మార్ట్‌ఫోన్లకు చిన్నా పెద్ద అందరూ బానిసలయ్యారు. స్మార్ట్‌ఫోన్ కారణంగా అనేక అనారోగ్య సమస్యలు సైతం ఎదురవుతున్నాయి. అతి ఎప్పటికైనా అనర్థాలకు దారి తీస్తుంది. ఈ నేపథ్యంలో మెల్లిమెల్లిగా స్మార్ట్‌ఫోన్లను దూరం ఉంచితే సరిపోతుంది.
Smary-PhoneUsing
-చాలా రోజులుగా స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారు ఒక్కసారిగా ఆపేయడం కుదరని పని. అందుకని మెల్లగా ఫోన్ లేకుండా అర్ధగంట, గంటపాటు బయటకు వెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఇలా రోజూ ప్రయత్నిస్తే అదే అలవాటుగా మారుతుంది. కొన్ని రోజులకు ఫోన్ లేకుండా గడపడం కూడా సాధ్యమవుతుంది.
-ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్ట్రాగ్రామ్ నోటిఫికేషన్లు అంత అత్యవసరం కాదు. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లు రాకుండా సెట్టింగ్స్ మార్చుకోవాలి. నోటిఫికేషన్స్ వల్ల చార్జింగ్ త్వరగా అయిపోతుంది. అంతేకాకుండా గ్రూపుల్లో వందలకు వందల మెసేజీలు చదివే వీలు ఉండదు కాబట్టి అవసరమైన మెసేజ్‌లు ఏమైనా ఉంటే పర్సనల్‌గా వాట్సప్ చేయమని మిత్రులకు ఓ మెసేజ్ పెట్టాలి.
-ప్రతిక్షణం విలువైందే. సోషల్ మీడియా, సెల్‌ఫోన్ గేమ్స్, వీడియోలు, ఆడియో సాంగ్స్ చాలామంది వీటన్నింటికీ అధిక సమయం వెచ్చిస్తుంటారు. రోజుకు కొంత సమయాన్ని కేటాయించి మాత్రమే సోషల్ మీడియాను వాడితే సమయాన్ని ఆదా చేసుకున్నట్లు అవుతుంది.
-నిద్రించే సమయంలో, పూజ గదిలోకి ఫోన్ తీసుకోకపోవడమే మంచిదనే నిబంధన పెట్టుకోవాలి. ఈ నిబందన కేవలం ఫోన్ వాడకాన్ని తగ్గించేదే అయినా మంచి ఫలితాల్నిస్తుంది. సెల్‌ఫోన్‌ను ఉదయం లేచిన వెంటనే చూడకూడదు. ఫోన్ కాంతి కిరణాల ప్రభావం కళ్లమీద పడి చూపు దెబ్బతింటుంది.
-ఫోన్ మన అవసరాల కోసం మాత్రమే అన్న విషయం మరిచిపోవద్దు. ఫోన్ వినియోగాన్ని తగ్గించడం మొదట్లో కాస్త ఇబ్బందిగానే అనిపించినా కొన్ని రోజులకు ప్రశాంతతను ఇస్తుంది. అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ వాడుతాను అనే నిబంధనతో మెదిలితే ఫోన్ వాడకం తగ్గుతుంది.

895
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles