పిల్లలు సరిగా నిద్రపోతున్నారా?


Fri,July 5, 2019 01:55 AM

చాలామంది పిల్లలు నిలకడ లేని మనస్తత్వంతో ఉంటారు. అయితే నిలకడ లేని మనస్తత్వానికి కారణం నిద్ర.. పిల్లలు సరిగా నిద్రపోకపోతే వారి మానసిక స్థితిపై ప్రభావం పడుతుంది. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే పిల్లలు హాయిగా నిద్రపోతారు.
Baby-Sleep
-వయసుకు తగ్గట్టు పిల్లలు నిద్రపోయేలా అలవాటు చేయాలి. నాలుగు నుంచి 5 ఏండ్ల వయసు గల పిల్లలకు 11 గంటల 30 నిమిషాలు నిద్రపోవాల్సి ఉంటుంది. 5 నుంచి 8 ఏండ్లపిల్లలు 11 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. 8 నుంచి 10ఏండ్ల పిల్లలు 10 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది.
-సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజు పడుకోవడం, లేవడంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి. సెలవుల్లో పిలల నిద్ర వేళల క్రమం మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా బడి తెరవడానికి కనీసం వారం రోజులు ముందు నుంచి నిద్ర వేళల్ని సరిచేయాలి.
-పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియో గేములు వంటివి ఉంచొద్దు. అలాగే నిద్ర వేళకు అరగంట ముందు వాటిని చూడనీయకూడదు. అరగంట ముందు చదవడం, హోం వర్కు చేయడం నిలిపివేయాలి. సాయంత్రం, రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. సాయం కాలం తర్వాత చాక్లెట్లు, కోలా డ్రింకులు తాగనీయవద్దు. వీటిలోని కెఫిన్ రోజూవారి నిద్రను చెడగొడుతుంది.
-పడుకునే ముందు రిలాక్స్ కావడాన్ని పిల్లలకు నేర్పించాలి. బెడ్ రొటీన్స్ అలవాటు చేయాలి. సరిగా నిద్రపోతేనే పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉంటుందనే విషయాన్ని పెద్దలు గ్రహించాలి. కొంతమంది పిల్లలు పడుకునే ముందు తియ్యని పదార్థాలు తింటారు. మరికొంత మంది టీ, కాఫీలు కావాలని పట్టుబడుతుంటారు. ఈ పద్ధతి పిల్లల పళ్లను పాడు చేస్తుంది.
-పిల్లలను మధ్యాహ్నం పూట ఒక గంట సేపైనా నిద్రపోయేలా చూడాలి. మధ్యాహ్నం నిద్ర పిల్లలకు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. పిల్లలు గురకపెట్టే అలవాటు ఉంటే ఉదయం సాయంత్రం గోరు వెచ్చని నీటిని తాగిస్తే సరిపోతుంది.

957
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles