స్టయిలిష్ హ్యాండ్‌బ్యాగ్


Fri,July 5, 2019 01:54 AM

మామూలుగా వంద నుంచి కొన్ని వేల రూపాయల ధర పలికే హ్యాండ్‌బ్యాగులను చూశాం. కానీ ఏకంగా 2.6 కోట్లతో ఒక హ్యాండ్ బ్యాగును కొన్నది నీతా అంబానీ. ఆ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది.
neetha-ambani-hand-bag
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ మళ్లీ వార్తల్లోకెక్కారు. ఇటీవల బాలీవుడ్ నటి కరిష్మా కపూర్, నీతా అంబానీ మరో ఇద్దరు కలిసి యూకేకు వెళ్లారు. వారు అక్కడ దిగిన ఫొటోను కరిష్మాకపూర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్టులో నీతా అంబానీ బ్యాగు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ బ్యాగు విలువ 2.6 కోట్లు. ఈ బ్యాగులో 240 డైమండ్స్ పొందుపరిచారు. తెలుపురంగులో ఉన్న ఈ హ్యాండ్ బ్యాగు హిమాలయ జలాల్లోని మొసలి చర్మంతో చేసింది. దీన్ని 2017లో వేలం వేయగా 2.6 కోట్లకు అమ్ముడైంది. ప్రపంచంలో ఇప్పటివరకు ఇంత ధర పెట్టి బ్యాగును ఎవరూ కొనుగోలు చేయలేదు. కాగా అంబానీ హ్యాండ్‌బ్యాగు ఖరీదుతో ఢిల్లీలో త్రిబుల్ బెడ్రూం ఫ్లాట్ కొనుక్కోవచ్చని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం నీతా అంబానీ వాడుతున్న బ్యాగు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

222
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles