దివ్యాంగుల కోసం...


Fri,July 5, 2019 01:45 AM

పార్కు కు వెళదామా అనగానే పిల్లలు ఎగిరి గంతులేస్తారు. మరి అంగవైకల్యంతో బాధపడుతున్న పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్లకూ పార్కులో ఆడుకోవాలని ఉంటుంది కదా! అందుకే దివ్యాంగులైన పిల్లల కోసం చెన్నైలో ప్రత్యేకంగా ఓ పార్కును ఏర్పాటు చేశారు.
designnjknkjnkj
ఒక్కసారి ఆ పార్కులోకి అడుగుపెడితే కాళ్లు కదపలేని చిన్నారులు జారుడుబల్లపై ఆనందంగా ఆడుకుంటూ కనిపిస్తారు. చూపు లేని చిన్నారులు చేతులతో తడుముతూ వస్తువులను గుర్తుపడుతూ ఎగిరి గంతు లేస్తుంటారు. దివ్యాంగులైన పిల్లల కోసం ప్రత్యేకం గా ఏర్పాటు చేసిన ఈ పార్కులో కనిపించే దృశ్యాలివి. చెన్నైలో సిటీ కార్పొరేషన్ అధికారులు దివ్యాంగుల కోసం సెన్సరీ పార్కును ఏర్పాటు చేశారు. ఒక స్వచ్ఛంద సంస్థను నిర్వహించే కవితా కృష్ణమూర్తి అనే వ్యక్తి ఈ పార్కు ఏర్పాటు కోసం తీవ్రంగా శ్రమించారు. దీని కోసం గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ రూ.1.5 కోట్లు వెచ్చించింది. దివ్యాంగులైన పిల్లల్లో సెన్సరీ ఆర్గాన్‌ల పనితీరును పెంచేం దుకు ఈ పార్కు దోహదపడుతుంది. పార్కులో రెండుచోట్ల ప్రకాశవంతమైన రంగులతో బొమ్మలు వేసిన గోడలను ఏర్పాటు చేశారు. టైర్లు, బ్యాంగిల్స్, షెల్స్, ఇతర వస్తువులతో గోడను అందంగా డిజైన్ చేశారు. వీల్‌చైర్‌కు పరిమితమైన పిల్లలు సైతం ఆడుకునేందుకు ఇందులో కొన్ని ఏర్పాట్లు చేశారు. వీల్‌చైర్‌లో కూర్చుని బాస్కెట్‌బాల్ ఆడుకునే విధంగా కోర్టును ఏర్పాటు చేశారు. ఇసుక, గులకరాళ్లు, కలపతో కొన్ని దారులు ఏర్పాటు చేశారు. వాటిలో నడవడం ద్వారా పిల్లలు తెగ ఆనందపడిపోతున్నారు.

892
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles