ప్రయాణవేళ జాగ్రత్తలు


Fri,July 5, 2019 01:44 AM

విహారం అందులోనూ వానకాలపు ప్రయాణం చాలా జాగ్రత్తలతో కూడుకున్నది. ప్రణాళికపరంగా ఎంపిక చేసుకుంటే మంచిది. మనం వెళ్లే ప్రాంతాలను గురించి అక్కడి ఆహార పదార్థాలు, వాతావరణ స్థితిగతులు ముందే తెలుసుకుంటే మన విహారయాత్ర సుఖవంతంగా ఉంటుంది.
kerala-monsoon
వానకాలంలో పర్యాటానికి వెళ్లాలనుకునేవారు ట్రావెల్‌బ్యాగ్‌లో దుస్తులతో పాటు వాటర్ బాటిళ్లు, మందులు, కెమెరా, టూర్ మ్యాప్ తప్పనిసరిగా ఉండాలి. టూరుకు వెళ్ళే వారు ముందుగా దుస్తు లు, ఇతర వస్తువులు సక్రమంగా సర్దుకోవాలి. తక్కువ బరువు, ఎక్కువ వస్తువులు పట్టే లేటెస్టు బ్యాగులు తీసుకుంటే మంచిది. వర్షకాలం కనుక ఎక్కడ పడితే అక్కడ నీళ్లు తాగడం మంచిది కాదు. అందుకే వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడం ఉత్తమం. ఇంకా కెమెరా, డైరీ, ప్లాస్క్,మెడికల్ కిట్,టూర్ మ్యాప్ వెంట ఉంచుకోవాలి. వర్షకాలంలో రెయిన్‌కోట్లు తప్పనిసరి.షూ వేసుకుంటే తడిసి ఆరకపోవడం వల్ల వాసన వచ్చే అవకాశం ఉంటుంది కనుక చెప్పులు బెటర్.రాత్రిపూట చలివేయకుండా బెడ్‌షీట్లు కూడా అవసరమే. స్మార్ట్, ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌లు తమ వెంట తీసుకెళ్తే అందులోని నేవిగేషన్ యాప్ ద్వారా వేళ్లే చోటుకు దారిని తెలుసుకోవచ్చు. తెలియని ప్రదేశానికి కూడా ఈయాప్ ఎంతో ఉపయోగపడుతుంది. వెళ్ళాల్సిన ప్రదేశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల సమయం ఆదా అవుతుంది. టూర్‌కు సరిపడా దుస్తులు తీసుకెళ్ళాలి. ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందులు తప్పవు.

781
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles