భక్తునికీ భగవంతుని స్థాయి!


Fri,July 5, 2019 12:56 AM

Bhaktimargam
భక్త్యా భాగవతం జ్ఞేయం/ నవ్యుత్పత్తి నటీకయా అన్నది శ్రీమద్భాగవత వచనం. పాండిత్య ప్రతిభ, టీకా తాత్పర్యాలకన్నా భక్తి మాత్రమే ప్రధానమన్న దృక్పథమే భాగవత వైశిష్ఠ్యాన్ని రెండింతలు చేసింది. దీన్నే తెలుగులో పోతన భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు అన్నాడు. ఫలితంగా దీన్ని తెలుసుకోవాల్సిన జిజ్ఞాస కలుగుతుంది. నిజానికి తెలుసుకోవలసింది లోక కల్యాణం అన్నదే అసలైన భాగవత తత్తం. అదే భగవద్భక్తి కూడా. ఆ భక్తే భాగవతాన్ని తెలుసుకోవడానికి కీలకం.
భగవంతుడు విరాట్ పురుషుడు. అతడే సమాజ స్వరూపుడు కూడా.

అతడే సర్వజీవకోటి ప్రాణరూపుడు. అతనిపై భక్తిని కలిగించే ఆధ్యాత్మిక గ్రంథమే శ్రీ మహాభాగవతం. ఇది నేటి సమాజానికి అవసరమైన ఈశ్వర లక్షణాన్ని, తత్వాన్ని అద్భుతంగా తెలిపింది. ఒక్కమాటలో చెప్పాలంటే, భాగవతం భగవంతునితో సమానస్థాయిని భక్తునికి కూడా కల్పించింది. భాగవత సంప్రదాయంలో భక్తుడు, భగవంతుడు ఒకే స్థాయి వారన్న భావన ఇంచుమించు స్థిరపడింది. కులమత వర్గాలకు అతీతమైన కల్మషం లేని, స్ఫటికం వంటి భక్తే ప్రధానమన్న సందేశాన్ని ఈ మహద్రంథం సమాజానికి ఇచ్చింది.
- గన్నమరాజు గిరిజా మనోహరబాబు

604
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles