వేడి..వేడి.. పకోడి!


Thu,July 4, 2019 01:44 AM

shoes
చిరుజల్లులు పలుకరించాయి.. హృదయం కూడా పులకరిస్తుంది కదా! చల్లని సాయంత్రాన.. గరం.. గరం చాయ్‌తో పాటు.. వేడి.. వేడి.. పకోడి ఉంటే ఆ టేస్టే వేరు! అందుకే కరకరలాడే వెరైటీ పకోడీలు.. వెజ్.. నాన్‌వెజ్ అనే భేదం లేకుండా..
ఈ వారం వంటకాల్లో మీకోసం సిద్ధం చేశాం..


నువ్వుల రొయ్యల పకోడి

nuvvula-roayala-pakodi

కావాల్సినవి :

రొయ్యలు : 250 గ్రా.
నువ్వులు : 50 గ్రా.
బియ్యం పిండి : 50 గ్రా.
శనగపిండి : 50 గ్రా.
ఉప్పు : తగినంత
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 20 గ్రా.
జీలకర్ర : 5 గ్రా., పచ్చిమిర్చి : 5
చాట్‌మసాలా : 10 గ్రా., నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

ఒక గిన్నెలో రొయ్యలు వేసి కొద్దిగా ఉప్పు కలుపుకోవాలి. కాసేపటి తర్వాత రొయ్యలలో నువ్వులు, బియ్యం పిండి, శనగపిండి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నూనె పోసి ఒక్కొక్క ముక్కను నూనెలో బాగా వేయించుకోవాలి. బాగా డీప్ ఫ్రై అయిన ఈ ముక్కలను ప్లేట్‌లోకి తీసుకోవాలి. పై నుంచి చాట్‌మసాలా చల్లి వేడి వేడిగా ఆరగిస్తే ఆ టేస్టే వేరు.

పొనగంటి చికెన్ పకోడి

panganti

కావాల్సినవి :

పొనగంటి ఆకు : ఒక కట్ట
చికెన్ బోన్‌లెస్ : 250 గ్రా.
పచ్చిమిర్చి : 5
ఉప్పు : తగినంత
పసుపు : పావు టేబుల్‌స్పూన్
జీలకర్ర పొడి : ఒక టేబుల్ స్పూన్
నిమ్మరసం : ఒక టేబుల్‌స్పూన్
బియ్యంపిండి : 50 గ్రా.
మైదా : 50 గ్రా.
శనగపిండి : 25 గ్రా.
నూనె, ఉప్పు : తగినంత

తయారీ :

పొనగంటి ఆకు, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి కలుపాలి. తర్వాత చికెన్‌ని కడిగి ఒక గిన్నెలో వేయాలి. అందులో పొనగంటి ఆకు పేస్ట్, పసుపు, జీలకర్రపొడి, నిమ్మరసం, బియ్యంపిండి, శనగపిండి, మైదాపిండి వేసి బాగా కలుపాలి. ఆ తర్వాత కడాయిలో నూనె పోసి స్టవ్ వెలిగించాలి. నూనె మరిగిన తర్వాత కలిపి పెట్టిన చికెన్ ముక్కలను నూనెలో వేయించాలి. దోరగా వేగిన తర్వాత చికెన్‌ను ఒక ప్లేట్‌లోకి తీసుకుంటే పొనగంటి చికెన్ పకోడి తయారయినట్లే!

పాలక్ పన్నీర్ పకోడి

palak-panner

కావాల్సినవి :

పన్నీర్ : 200 గ్రా., పాలకూర : 1 కట్ట,
పచ్చిమిర్చి : 5, శనగపిండి : ఒక కప్పు,
కారం : ఒక టేబుల్ స్పూన్, ధనియాలపొడి : ఒక టేబుల్ స్పూన్, పసుపు : అర టేబుల్ స్పూన్, ఓమా : చిటికెడు, కొత్తిమీర : చిన్న కట్ట, ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

ముందుగా పన్నీర్‌ని చిన్నగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక గిన్నెలో వేయాలి. అందులో పన్నీర్, శనగపిండి, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, ఓమా, కొన్ని నీళ్లు పోసి మరీ వదులుగా కాకుండా కలుపాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె ఎక్కువ పోసి కాగనివ్వాలి. ఒక్కొక్క ముక్కను నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అంతే.. రుచికరమైన పాలక్ పన్నీర్ పకోడి రెడీ!

జీడిపప్పు చేప పకోడి

jeedipappu

కావాల్సినవి :

బోన్‌లెస్ చేప : 250 గ్రా., కారం పొడి : 2 టేబుల్ స్పూన్, పసుపు :
పావు టేబుల్ స్పూన్, మెంతుల పొడి : అర టేబుల్ స్పూన్, జీడిపప్పు : 100 గ్రా., కరివేపాకు : 2 రెమ్మలు,
జీలకర్ర పొడి : అర టేబుల్ స్పూన్, బియ్యంపిండి : 50 గ్రా.,
శనగపిండి : 50 గ్రా., ఉప్పు, నూనె : తగినంత

తయారీ :

చేపను ఫింగర్ టిప్‌లా కట్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకును ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ వెలిగించి కడాయిలో కొద్దిగా నూనె పోసి కాగిన తర్వాత చేప వేసి అందులో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, కరివేపాకు, పసుపు, మెంతుల పొడి వేసి బాగా కలుపాలి. ఇవి కాస్త వేగాక బయట గిన్నెలో వేయాలి. ఆ తర్వాత దీంట్లో జీడిపప్పు, బియ్యంపిండి, శనగపిండి వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మరుగుతున్న నూనెలో ఈ ముక్కలను వేసి దోరగా వేయిస్తే జీడిపప్పు చేప పకోడి మీ నోరూరిస్తుంది.

క్రిస్పీ చికెన్ పకోడి

crispy

కావాల్సినవి :

చికెన్ బోన్‌లెస్ : 250 గ్రా.,
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 50 గ్రా.,
గ్రీన్ చిల్లీసాస్ : 10 గ్రా., శనగపిండి : 150 గ్రా., బియ్యంపిండి : 150 గ్రా., ఓమా : 5 గ్రా.,
నిమ్మరసం : అర టేబుల్‌స్పూన్, కార్న్‌ఫ్లేక్స్ : 200 గ్రా., టమాటా సాస్ : 100 గ్రా., నూనె,
ఉప్పు : తగినంత

తయారీ :

గిన్నె తీసుకొని దానిలో చికెన్, అల్లంవెల్లుల్లి పేస్ట్, గ్రీన్‌చిల్లి పేస్ట్, ఉప్పు, శనగపిండి, బియ్యంపిండి, ఓమా, నిమ్మరసం వేసి బాగా కలుపాలి. తర్వాత కార్న్‌ఫ్లేక్స్ తీసుకొని ముందుగా కలుపుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసి కలుపాలి. ఈ ముక్కలను మరుగుతున్న నూనెలో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. క్రిస్పీ చికెన్ పకోడకి టమాటా సాస్ జోడిస్తే టేస్టీగా ఉంటుంది.


- జి.యాదగిరి
-కార్పొరేట్ చెఫ్
-వివాహభోజనంబు రెస్టారెంట్
-జూబ్లీహిల్స్, హైదరాబాద్
-పార్క్‌లైన్, సికింద్రాబాద్

2142
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles