హైదరాబాద్ అరచేతిలో..


Wed,July 3, 2019 02:09 AM

hyd
హైదరాబాద్ విస్తరిస్తున్న పెద్ద నగరం. రోజుకు వేల మంది వస్తుంటారు. చదువు కోసమో, ఉద్యోగం కోసమో, వృత్తి కోసమో, ఉపాధి కోసమో హైదరాబాద్‌లో అడుగు పెడతారు. అంతా కొత్తగా ఉంటుంది. ఎవరికీ ఎవరూ తెలియరు. కొందరికి ఎలాంటి పరిచయాలుండవు. కొన్ని రోజులు అయోమయ పరిస్థితులు ఏర్పడతాయి. ఇలాంటి సమయంలోనే హైదరాబాద్‌లో కొన్ని మొబైల్ యాప్‌లు సాటి మనిషిలా సాయపడతాయి. హైదరాబాద్‌కు వచ్చే ముందు వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటే ఎంతో
ఉపయోగకరంగా ఉంటాయి.

hyd6
అర్ధరాత్రి బస్ దిగారు. బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నట్టుగా అనిపించడం లేదు. ఏమీ చేయాలో తోచడం లేదు. వెంటనే మొబైల్ తీసి క్యాబ్ బుక్ చేయొచ్చు. ఉదయాన్నే లేచి మీరు ఒక ప్లేస్‌కు వెళ్లాలి. కానీ సరైన దారి తెలియదు. ఎవరిని అడిగినా క్లియర్‌గా చెప్పరు. అందుకే వెళ్లాల్సిన ప్రదేశాన్ని సెర్చ్ చేస్తే మీకు దారి చూపించే బాధ్యత ఇంటర్‌నెట్ తీసుకుంటుంది. మీరు రూంలో ఉంటారు. ఆకలవుతుంది. వండుకొనే ఓపిక ఉండదు. హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఓ యాప్ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. ఇలా సందర్భమేదైనా, సమయమేదైనా హైదరాబాద్ వచ్చే ఎవరికైనా సరే ఈ యాప్స్ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాయి.
hyd1

సిటీ బస్ ప్రయాణం

బస్టాప్‌లో నిల్చున్నారు. రకరకాల బస్సులు వస్తున్నాయి. ఏవేవో నంబర్లు వేసి ఉన్నాయి. కానీ మీరు వెళ్లాల్సిన ఏరియాకు ఏ బస్ వెళ్తుందో తెలియదు. మరి ఏ బస్ వెళ్తుందో ఎలా గుర్తు పట్టాలి. ఆ ఏరియాకు వెళ్లాలంటే ఏ నంబర్ బస్సెక్కాలి. ఇలా సిటీ బస్ వివరాలను తెలపడానికి హైదరాబాద్ ఆర్టీసీ పేరుతో యాప్ ఉంది. హైదరాబాద్‌లో ఆర్టీసీ నడిపే సిటీ బస్సులు నగరవాసులకే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారికి నిత్యం ఉపయోగపడుతున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నామంటే బస్సుల సమాచారం అంతా అరచేతిలో ఉన్నట్టే..
hyd2

సాయం కావాలా?

నగరాల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉంది జస్ట్ డయల్. ఆస్పత్రులు, హోటళ్లు, కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు, సినిమా థియేటర్లు, ట్రావెలింగ్ సర్వీస్‌లు ఇలా సరైన వివరాలు అందిస్తుంది జస్ట్ డయల్. మీ పరిధిలో ఉండే దేని వివరాలైన తెలుసుకోవాలంటే జస్ట్ డయల్‌ను సంప్రదించవచ్చు. ఇది యూజర్‌కు లోకల్ సెర్చ్ ఇంజిన్ గా పని చేస్తుంది. వివిధ రకాల సర్వీస్‌ల సమాచారాన్ని వినియోగదారులకు అందిస్తుంది.
hyd3

మెట్రో ప్రయాణమా?

హైదరాబాద్ మెట్రో ప్రయాణం అంటే కాదనని వారు ఉండరు. సులభంగా, సాఫీగా ప్రయాణం చేయడానికి మె ట్రోను వినియోగించుకుంటున్నారు. ట్రా ఫిక్ సమస్య లేకుండా సమయాన్ని ఆదా చేసుకోవడానికి మెట్రో ఆశ్రయిస్తున్నా రు. ఇలాంటి ప్రయాణికుల కోసం మెట్రో ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ యాప్‌ను తయారు చేసింది. Tsavaari పేరుతో ఇది అండ్రాయిడ్, ఐఓస్ కోసం అందుబాటులో ఉంది. ఇందులో మెట్రో వివరాలు, చార్జీలు, దూరం, సమయం అన్నీ క్లుప్తంగా ఉంటాయి. దగ్గర్లోని మెట్రోస్టేషన్ లొకేషన్లను కూడా చూపిస్తుంది. అవసరం అయితే క్యాబ్‌లను కూడా ఈ యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు. అలాగే లోకల్‌లో ప్రయాణించడానికి ఎంఎంటీఎస్‌లు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవడానికి mmts 4u యాప్ అందుబాటులో ఉంది.
hyd5

సినిమాకు వెళ్తున్నారా?

అభిమాన హీరో సినిమాను మొదటి రోజు, మార్నింగ్ షో చూడాలంటే ఎంతకష్టం!. అసలు టికెట్లు దొరుకుతాయో లేదో అనే సందేహం! దొరకాలంటే ఎంత కష్టపడాలి. ఎంత సేపు లైన్లో నిలబడాలి? అనే సందేహాలు సహజంగానే వస్తాయి. అసలు ఇప్పుడు సినిమా చూడాలంటే లైన్లో నిలబడాల్సిన పని లేదు. చేతిలో ఫోన్, డేటా, బ్యాంకులో బ్యాలెన్స్ ఉంటే చాలు. ఏ సినిమా అయినా, ఏ షో టికెట్టయినా ఈజీగా బుక్ చేసుకోవచ్చు. book my show యాప్‌తో నగరంలోని థియేటర్లలో టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇది దేశవాప్తంగా సర్వీస్ ఇస్తున్న యాప్. ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్‌లు పొందవచ్చు.
hyd4

ప్రయాణమా?

నగరంలో అర్జంట్‌గా ఒక ప్రదేశానికి వెళ్లాలి. బస్టాప్ దూరంగా ఉంది. ఒకవేళ అక్కడికి వెళ్లినా బస్ ఏ టైంకు వస్తుందో తెలియదు. అలాంటి టైంలోనే క్యాబ్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. కానీ ఎవరిని అడగాలో తెలియదు. అలాంటి వారి కోసమే మీకు క్యాబ్‌ను ఐదు నిమిషాల్లో అరేంజ్ చేస్తాం అంటున్నాయి ఎన్నో సంస్థలు. హైదరాబాద్ క్యాబ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేస్కోండి. అన్ని రకాల క్యాబ్‌ల సమాచారం అందుబాటులో ఉంటుంది. ఓలా, ఉబర్, స్కై క్యాబ్స్ కంపెనీలు ప్రయాణికులకోసం క్యాబ్‌లు అందిస్తున్నాయి. సిటీ లోపల, సిటీ బయట తదితర కేటగిరీల్లో క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయి. కారు కాకుండా బైక్ మీద వెళ్లాలి అనుకుంటే ర్యాపిడో ఉంది. బైక్‌ను అద్దెకు తీసుకోవాలనుకుంటే vogo bikes ఉంది. బస చేయడానికి ఓయో, ఫ్యాబ్ యాప్‌ల ద్వారా హోటళ్లను బుక్ చేసుకోవచ్చు.

- వినో..

701
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles