గూగుల్.. కొత్త టూల్..


Wed,July 3, 2019 01:57 AM

featur
గూగుల్ కొత్త టూల్‌ను పరిచయం చేసింది. గూగుల్ సెర్చ్‌లో వెతికిన యూజర్ల డేటాను ఇప్పటి వరకూ మాన్యువల్‌గా డిలీట్ చేయాల్సి ఉండేది. ఇక నుంచి అలా అవసరం లేదు. సెర్చ్ డేటాను అటోమేటిక్‌గా డిలీట్ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ రెండిటీలో యూజర్లు సెర్చ్ చేసిన డేటాను ఆటోమేటిక్‌గా, మాన్యువల్‌గా కూడా డిలీట్ చేసుకోవచ్చు. లొకేషన్ ట్రాకింగ్,వెబ్, యాప్ యాక్టివిటీ హిస్టరీని కంట్రోల్ చేయవచ్చు. ఇప్పటి నుంచి యూజర్లు తమ బ్రౌజర్ లో ట్రాకింగ్ ఫ్రిపెరెన్సెస్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 నెలలు లేదా 18 నెలలు వరకు సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకుంటే అలా.. మీ డేటా ఆటోమాటిక్ గా ఆ సమయానికి డిలీట్ అయిపోతుంది. ఇందుకోసం గూగుల్ Auto-Delete Tool ను ప్రవేశపెట్టింది. యూజర్ ప్రైవసీ సమస్యపై ఇటీవల జరిగిన డెవలపర్ కాన్ఫిరెన్స్‌లో గూగుల్, ఆపిల్ సహా ఇతర టెక్ దిగ్గజాలు సుదీర్ఘంగా చర్చించాయి. ఈ సమావేశంలో యూజర్ల ప్రైవసీ కోసం కొత్త టూల్స్ ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి. థర్డ్ పార్టీ యాప్స్ ల్లో యూజర్లు షేర్ చేసిన డేటా దుర్వినియోగం కాకుండా ఉండాలంటే ఆటో డిలీట్ టూల్ వంటి ఫీచర్లు ప్రవేశపెట్టాలని నిర్ణయించాయి.

1293
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles