వాట్సప్ నుంచి మల్టీ చాటింగ్


Wed,July 3, 2019 01:52 AM

wtsup
వాట్సప్ ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నది. ఇప్పుడు తాజాగా మరో ఫీచర్‌ను జోడించబోతున్నది.

వాట్సప్‌లో మల్టీ చాటింగ్ ఫీచర్ అందుబాటులోకి రానున్నది. ఈ ఫీచర్ ద్వారా ఒకే ప్లాట్ ఫాం నుంచి మల్టిపుల్ ప్లాట్ ఫాంలపై చాటింగ్ చేసుకోవచ్చు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, జీమెయిల్, గూగుల్ ఫొటోలు ప్లాట్ ఫాలంపై స్టోరీల స్టేటస్ పోస్టులను షేర్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. వాట్సప్ యూజర్లు తమ స్టేటస్ పోస్టులను షేర్ చేయాలంటే తమ అకౌంట్లను ఫేస్‌బుక్ అకౌంట్‌కు లింక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్ ల్లోని API టెక్నాలజీ డేటా షేరింగ్ ద్వారా వాట్సప్‌లోని స్టేటస్ పోస్టుకు మరో ప్లాట్ ఫాంలోకి షేర్ చేసుకునే అవకాశం ఉంది. API ఎనేబుల్ ఇతర ఏ యాప్స్‌తోనేనైనా తమ స్టేటస్ పోస్టులను యూజర్లు షేరింగ్ చేసుకోవచ్చు.

813
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles