ఎక్కువ సైజ్ డేటా మెయిల్ చేయాలా?


Wed,July 3, 2019 01:49 AM

ఫైల్ ట్రాన్స్‌ఫర్ కోసం మనం మెయిల్‌ను ఎక్కువగావాడుతుంటాం. కానీ 25 ఎంబీల కంటే ఎక్కువ సైజ్ ఉంటే అది డ్రైవ్‌లోకి వెళ్తుంది. అప్‌లోడింగ్‌కు కూడా ఎక్కువ టైం పడుతుంది. అనవసరం అనుకున్న డేటా అంతా డ్రైవ్‌లో సేవ్ అవుతుంది. ఇలాంటి డేటాను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేయాలంటే ఎలా?
image
ఎక్కువ సైజ్ ఉన్న డేటాను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేయడానికి wetransfer.com చక్కని ఫ్లాట్ ఫామ్. 2 జీబీ సామర్థ్యం ఉన్న ఫైల్స్‌ను కూడా క్షణాల్లో అవతలి వారికి పంపవచ్చు. ఇదంతా వారికి రెగ్యులర్ ఈమెయిల్ ద్వారా అందుతుంది. wetransfer లోకి వెళ్లి ఇందులో ఫైల్స్‌ను అప్‌లోడ్ చేయాలి. తర్వాత అవతలి వారి మెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయాలి. అప్‌లోడ్ అయ్యాక సెండ్ చేయాలి అంతే. వెంటనే వారికి మెయిల్‌లో ఒక లింక్ వెళ్తుంది. ఆ లింక్ ద్వారా మీరు పంపిన డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

281
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles