ఓల్డ్ ఈజ్ గోల్డ్


Wed,July 3, 2019 12:52 AM

ఫ్యాషన్ ప్రపంచం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. ఈ రోజు మార్కెట్లో ఉన్న ట్రెండ్ రేపు మారొచ్చు. పెద్ద గల్లా చొక్కా, పొట్టి నిక్కరు ముప్పై ఏండ్ల కిందట ఫేమస్. కాలక్రమంలో అవి మరుగున పడిపోయాయి. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ప్యారిస్‌కు చెందిన ఓ మోడల్ ధరించిన దుస్తులు ప్రస్తుతం సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నవి.
miu-miu
ప్యారిస్‌లో ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభంలో రేస్‌ట్రాక్ నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో అక్కడి మోడల్స్ వివిధ రకాల దుస్తులు ధరించి రేస్ ట్రాక్ పై నడుస్తారు. అయితే ఇటీవల జరిగిన రేస్ ట్రాక్‌లో మియూ మియూ అనే మోడల్ 1930 కాలం నాటి దస్తుల్ని ధరించి ట్రాక్‌పై నడిచింది. అక్కడున్న వారందరి చూపును తన వైపునకు తిప్పుకున్నది. పొట్టి నెక్కరు, షర్టు ధరించింది. వీటిపై నుంచి పెద్ద గల్లా ఉన్న ఓ పొడవాటి సూట్‌ను ధరించింది. రంగు రంగుల షూ వేసుకుని మియూ మియూ ట్రాక్‌పై నడుస్తుంటే అక్కడున్న వారంతా కేరింతలు కొట్టారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ కేకలు పెట్టారు. ఈ షో అనంతరం అక్కడి షాపింగ్ మాళ్లలో ఈ మాదిరి దుస్తులు చాలామంది అడిగారట. ప్రస్తుతం అన్ని షాపింగ్ మాళ్లలో మియూ మియూ మోడల్ డ్రెసెస్ అందుబాటులో ఉన్నాయి. అక్కడి మార్కెట్లో సైతం వాటికి భారీ డిమాండ్ ఉన్నది.

1497
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles