గడ్డం ఆరోగ్యానికి అడ్డం


Wed,July 3, 2019 12:51 AM

ఇటీవల గడ్డం పెంచే యువత సంఖ్య పెరిగిపోతున్నది. ఈ క్రమంలో గడ్డం పెంచితే అనారోగ్యం పాలవడం ఖాయమని ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. శునకాల బొచ్చుతో పోలిస్తే పురుషుల గడ్డంలోనే ఎక్కువ క్రిములు ఉంటున్నట్లు తేలుస్తున్నది ఈ అధ్యయనం.
beord
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బియర్డ్(గడ్డం పెంచడం) ట్రెండ్ కొనసాగుతున్నది. సర్కిల్ బియర్డ్, రాయల్ బియర్డ్, వాన్ డైక్ బియర్డ్ అంటూ రకరకాల షేపుల్లో గడ్డం పెంచుతున్నారు మగవాళ్లు. ఆకట్టుకునే ముఖం కోసం, ఫ్యాషన్ కోసం ఒకరిని చూసి మరొకరు ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా గడ్డంలో క్రిములు పేరుకుపోయి అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ విషయమై ఇటీవల స్విట్జర్లాండ్‌లోని హిర్ స్లాండెన్ క్లినిక్ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఆండ్రియాస్ గుట్ జీట్ నేతృత్వంలో ఓ అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా వారు ఎంఆర్‌ఐ స్కానర్‌లోకి శునకాలను పంపారు. తర్వాత మరో రెండు స్కానర్లలోకి గడ్డం ఉన్న వ్యక్తులను పంపి పరిశీలించారు. రెండింటినీ పోల్చి చూశారు. ఆండ్రియస్ బృందం పరిశీలనలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. శునకాల బొచ్చుతో పోలిస్తే ఆ పురుషుల గడ్డంలోనే ఎక్కువగా బ్యాక్టీరియా, ఇతర క్రిములు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. గడ్డాన్ని వీలైనంత తక్కువగా పెంచుకుంటే మంచిదని వారు చెబుతున్నారు.

2743
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles