మొదటి పోటీకే కిరీటం!


Sun,June 30, 2019 01:03 AM

భారత సంతతికి చెందిన ప్రియా సెరావో మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా-2019 కిరీటం గెలుచుకున్న సంగతి తెలిసిందే. అయితే తాను పొల్గొన్న మొదటి పోటీలోనే ప్రతిష్ఠాత్మకమైన కిరీటం గెలుచుకోవడం చాలా గొప్ప విషయం. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ప్రియా ఎలా కష్టపడిందో తెలుసా?
Priya-Serrao
ఆస్ట్రేలియా అంటేనే అందగత్తెలకు నిలయం. అందులోనూ మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా పోటీలు. ఆ పోటీల ప్రకటన వెలువడిందే మొదలు.. ఆ దేశంలో ఉన్న అందగత్తెలందరూ పోటీలకు సిద్ధమయ్యారు. అప్పటికే మెల్‌బోర్న్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ జాబ్స్, ప్రెసింకట్స్ అండ్ రీజియన్స్‌లో విధులు నిర్వర్తిస్తున్న ప్రియా సెరావో కూడా పాల్గొనాలనుకున్నది. ఈ పోటీల్లో పాల్గొంటే కనీసం అనుభవమైనా వస్తుంది. ఈసారి వచ్చే పోటీల్లో గట్టి పోటీ ఇవ్వొచ్చు అనుకొని సెలెక్షన్స్‌కు వెళ్లింది. అక్కడ తన అందం, అభినయం చూసి మిస్ యూనివర్స్ ఆస్ట్రేలియా పోటీలకు ఎంపిక చేశారు నిర్వాహకులు. ఆ దేశ నలుమూలల నుంచి 26 మంది సుందరాంగులు పోటీలకు ఎంపికయ్యారు. ఆ పోటీల్లోని అన్ని విభాగాల్లో పైచేయి సాధించింది ప్రియా. ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 26 మందిని వెనక్కి నెట్టి కిరీటాన్ని ఎగరేసుకుపోయింది.

మనదేశానికి చెందిన ప్రియా కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పచుకున్నది. కర్ణాటకలోని మెల్మన్నీ పట్టణంలో పుట్టింది. ఆ తర్వాత ఒమన్‌లో చదువు కొనసాగించింది. తర్వాత ఆస్ట్రేలియాలో లా అండ్ పబ్లిక్ పాలసీ చదివి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించింది. 26 యేండ్ల ప్రియా సెరావో చదువుల్లోనూ టాపే. అందుకే రెండు యూనివర్సిటీల నుంచి న్యాయవిద్య పట్టా పుచ్చుకున్నది. పగలు విధులకు హాజరవుతూనే.. రాత్రిళ్లు పోటీల కోసం కష్టపడింది ప్రియా. మొదటి ప్రయత్నంలోనే తన కష్టానికి ప్రతిఫలం దక్కడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈ పోటీలో గెలుపొందుతాననే నమ్మకం లేకపోవడం వల్ల.. తన కుటుంబ సభ్యులను తీసుకురాలేదు. మొత్తానికి విజేతగా నిలవడంపట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నది.

783
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles