ట్రెండీ బ్యాగుల బామ్మ!


Sun,June 30, 2019 01:01 AM

89 యేండ్ల వయసులో ఉన్న వృద్ధులు ఎలా ఉంటారు? బాధ్యతలన్నీ పూర్తి చేసి, అలసిన శరీరం, మతిమరుపు, ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. కానీ ఈ బామ్మ మాత్రం చాలా ట్రెండీ. ఆ వయసులో కూడా ఆన్‌లైన్‌లో పొత్లీ బ్యాగుల వ్యాపారాన్ని ప్రారంభించి.. సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా మారింది.
Baamma-Bags
అసొంలోని దుబ్రీకి చెందిన లతిక చక్రవర్తి అనే వృద్ధురాలికి వయసు మళ్లినా.. ఆమె ఆలోచన మొత్తం నేటి ఫ్యాషన్ ప్రపంచం చుట్టే తిరుగుతున్నది. అందుకే నేటి స్మార్ట్ ట్రెండ్‌కు తగ్గట్లుగా పలు మోడళ్లలో బ్యాగులు తయారు చేస్తూ.. వృద్ధాప్యంలోనూ సంపాదిస్తున్నది. లతికకు వివిధ వస్ర్తాలను సేకరించడం హాబీ. ఆమె భర్త సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగి కావడంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు తరచూ మారుతూ ఉండాల్సి వచ్చేది. దీనివల్ల ఆయా ప్రాంతాలకు చెందిన ప్రత్యేకమైన చీరలు, వస్ర్తాలను కొనుగోలు చేసి భద్రపరచుకొనేవారు.

Baamma-Bags2
కొన్నాళ్లు గడిచిన తర్వాత తాను సేకరించిన చీరలను మళ్లీ ఉపయోగించాలని అనుకున్నారు. వాటితో తన పిల్లలకు దుస్తులు, స్వెట్టర్లు కుట్టేవారు. మనవళ్లు, మనవరాండ్లకు వాటితోనే బొమ్మలు తయారు చేసేవారు. ఐదేండ్ల క్రితం తన కోడలి చీరెకు మ్యాచింగ్ పొత్లీ బ్యాగ్ తయారు చేసింది. దాన్ని అందరూ మెచ్చుకోవడంతో తన పాత చీరెలతో పొత్లీ బ్యాగులు తయారుచేసి అమ్ముతున్నది. లతిక బ్యాగులకు ఫ్యాషన్ ప్రపంచంలో డిమాండ్ బాగా ఎక్కువ. జర్మనీ, న్యూజిలాండ్, ఒమన్ వంటి దేశాలనుంచి సైతం ఆమెకు ఆర్డర్లు వస్తున్నాయి.

832
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles