నెట్టింట మెన్ ఇన్ ఆరెంజ్!


Sun,June 30, 2019 12:57 AM

క్రికెట్ ప్రపంచకప్‌లో ఇవాళ ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచ్‌కు టీమిండియా ఆరెంజ్ డ్రెస్‌లో దిగనున్నది. ఈ డ్రెస్‌పై నెట్టింట మిశ్రమ స్పందన వస్తున్నది. సోషల్ మీడియాలో ఎక్కువ శాతం ప్రశంసల జల్లు కురుస్తున్నది.
Men-in-orenge
ఇవాళ టీమిండియా మెన్ ఇన్ బ్లూ కాదు.. ఆరెంజ్! నీలి రంగు డ్రెస్సుల్లో ఎప్పుడూ దర్శనమిచ్చే మన క్రికెట్ జట్టు ఇప్పుడు మెన్ ఇన్ ఆరెంజ్‌గా మారిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్‌లో భాగంగా మన క్రికెట్ జట్టు ఆరెంజ్ రంగు జెర్సీ ధరించబోతున్న విషయం తెలిసిందే. కొత్త జెర్సీలను శుక్రవారం అధికారికంగా విడుదల చేశారు. ఆ జెర్సీ బ్లూ, ఆరెంజ్ రంగుల మిళితంతో చూడముచ్చటగా ఉందనే ప్రశంసలు ఓవైపు వినిపిస్త్తుండగా.. సోషల్ మీడియాలో వీటిపై జోకులు పేలుతున్నాయి. కాగా, ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించడానికి వీల్లేదు.

దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్లూ జెర్సీనే ధరిస్తుండగా.. భారత్ మాత్రం వేరే రంగు జెర్సీని ధరించాల్సి ఉంది. దీనిలో భాగంగా బీసీసీఐ కోరిక మేరకు టీమిండియాకు ఆరెంజ్ రంగు జెర్సీని కేటాయించింది ఐసీసీ. దీంతో టీమిండియా స్పాన్సర్ నైకీ.. కొత్త జెర్సీలను సిద్ధం చేసింది. ఇక, కొత్త జెర్సీలను ధరించిన కోహ్లీసేన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. ముదురు నీలం రంగుతో పాటు నారింజ రంగు కూడా జోడించిన ఈ జెర్సీలపై ఓవైపు ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు స్విగ్గీ డెలివరీ బాయిస్ డ్రెస్‌ను పోలిఉందంటూ జోకులు పేల్చుతున్నారు నెటిజన్లు.

1512
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles